Advertisementt

ఇటలీకి పవన్-అన్నా లెజెనోవా

Sat 28th Oct 2023 01:02 PM
pawan kalyan  ఇటలీకి పవన్-అన్నా లెజెనోవా
Pawan Kalyan spotted along with his wife Anna Lezhneva at the airport ఇటలీకి పవన్-అన్నా లెజెనోవా
Advertisement
Ads by CJ

వరుణ్ తేజ్ పెళ్ళికి మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. ఇటలీలోని టుస్కనీ నగరంలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగబోతుంది. ఆల్రెడీ పెళ్లి కోసం షాపింగ్ చేస్తోన్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక నాగబాబు ఆయన భార్య పద్మజ ఇప్పటికే ఇటలీకి చేరుకున్నారు. లావణ్య ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఇటలీకి వెళ్లిపోయారు. మెగా ఫ్యామిలోని మెగాస్టార్ చిరు-సురేఖ, చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహ ఇలా మెగా జంటలు ఇంకా అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ చిరు కూతుళ్లు.. ఇలా అందరూ ఒక్కరిగా ఇటలీ చేకుంటున్నారు.

ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ ఆయన భార్య అన్నా లెజెనోవాతో కలిసి ఇటలీకి పయనమయ్యారు. ఎయిర్ పోర్ట్ లో పవన్ కళ్యాణ్-అన్నా లెజెనోవా కలిసి వెళుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. పవన్ భార్య అన్నా లెజినోవా మీడియాకి కనిపించడం, పబ్లిక్ లో తిరగడం కూడా చాలా తక్కువ. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి లెజినోవా కనిపించడంతో కెమెరా మ్యాన్స్ తమ కెమెరాలకు పని చెప్పారు. 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్-అన్నా లెజెనోవాల వీడియోస్, ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. నవంబర్ 1 న వరుణ్ తేజ్-లావణ్యల వివాహానికి ముందు అక్కడ పెళ్లి కొడుకు ఫంక్షన్, అలాగే మెహిందీ, సంగీత్ ఫంక్షన్స్ కోసం ఇలా రెండు రోజుల ముందు మెగా ఫ్యామిలీ ఇటలీకి పయనమైంది.

Pawan Kalyan spotted along with his wife Anna Lezhneva at the airport:

Pawan Kalyan and Anna Lezhneva turn heads at the airport while leaving for Varun and Lavanya wedding

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ