బిగ్ బాస్ సీజన్ 7 లో కెప్టెన్సీ కోసం ఎగబడిపోతున్నారు. ఈ సీజన్లో ప్రతి కంటెస్టెంట్ కూడా కప్పు గెలవాలనే కసితో కనిపిస్తున్నారు. ఎక్కడో అమర్, భోలే లాంటి వాళ్ళు మాత్రమే టాస్క్ ల పరంగా డల్ గా కనిపిస్తున్నారు తప్ప అమ్మాయిలు కూడా టాస్క్ ల విషయంలో చెలరేగిపోతున్నారు. శోభా శెట్టి, ప్రియాంక, అశ్విని ఇలా ఎవ్వరూ తగ్గడం లేదు. వరసగా ఏడుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయినా మిగతా వారు అబ్బాయిలతో సమానంగా పోటీ పడుతున్నారు.
ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీపడిన అందరిలో ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఫైనల్ కంటెండర్లు గా నిలిచారు. ప్రియాంక, శోభా శెట్టి, సందీప్, పల్లవి ప్రశాంత్, గౌతమ్ లు ఉండగా.. వారి మెడలో ఎండుమిర్చి దండ వేసి వాళ్లు కెప్టెన్ అయ్యే అర్హత లేదు అని చెప్పాలి. ఆ ప్రాసెస్ లో అమరదీప్ పల్లవి ప్రశాంత్ నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావ్.. మిగతా వారు నామినేషన్స్ లో ఉన్నారు అంటూ పల్లవి ప్రశాంత్ మెడలో దండ వేసాడు. దానితో రైతు బిడ్డ ఎప్పటిలాగే బిల్డప్ ఇచ్చాడు.
ఇక ఈ టాస్క్ లో యావర్ కి శోభా శెట్టికి మధ్యన ఫైట్ జరిగింది. శివాజీ వాళ్ళని విడగొట్టి ఇద్దరికీ సర్ది చెప్పాడు. ఆ తర్వాత భోలే ప్రియాంక ని కెప్టెన్ అవ్వడానికి కుదరదు అన్నాడు. రతికపై కూడా శోభా శెట్టి నువ్వు ఇంత అగ్రెసివ్ గా యాంగ్రిగా ఉంటే కెప్టెన్ అయ్యి ఏం చేస్తావ్ అంటూ రెచ్చ గొట్టింది. దానితో శోభా శెట్టి రెచ్చిపోయింది. ఇక తేజ పల్లవి ప్రశాంత్ కి మిర్చి దండ వేసాడు. చివరిగా శివాజీ సందీప్ ఒక్కసారి గౌతమ్ కి ఛాన్స్ ఇద్దామంటూ గౌతమ్ ని కెప్టెన్ చేసారు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో హౌస్ మేట్స్ సపోర్ట్ తో గౌతమ్ కెప్టెన్ అయ్యాడు.