రామ్ పోతినేని-బోయపాటి కలయికలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్యాన్ ఇండియా మార్కెట్ లో విడుదలైన స్కంద మూవీ ని ప్రేక్షకులు బావుంది అన్నా.. ఆ సినిమాకి అనుకున్న మేర కలెక్షన్స్ రాలేదు. అఖండతో భారీ విజయాన్ని మూటగట్టుకున్న బోయపాటి స్కంద అంచనాలు రీచ్ అవడంలో తడబడ్డారు. థమన్ మ్యూజిక్ కూడా హెల్ప్ చెయ్యలేకపోయింది. సెప్టెంబర్ 15 నే విడుదల అని ప్రకటించిన స్కందని సలార్ పోస్ట్ పోన్ అవడంతో సెప్టెంబర్ 28 న విడుదల చేసారు.
లాంగ్ వీకెండ్ ని స్కంద ఏమాత్రం వాడుకోలేకపోయింది. ఇక థియేటర్స్ లో సో సో గా ఆడిన స్కంద ఈరోజు అంటే అక్టోబర్ 27 న స్ట్రీమింగ్ అవుతుంది అని ప్రకటించారు. డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వాల్సిన ఈ చిత్రం ఓటిటి రిలీజ్ ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యింది. ఈరోజు స్ట్రీమింగ్ అవ్వాల్సిన ఈ చిత్రం ఓటిటిలోకి రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే అంటున్నారు. కొత్త స్ట్రీమింగ్ డేట్ ని డిస్ని ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయాల్సివుంది.