న్యూడ్ ఎంపీ అనగానే మనకు వెంటనే గోరంట్ల మాధవ్ గుర్తొచ్చి తీరుతారు. ఆయన అంతగా పాపులర్ అయిపోయారు. నిజానికి అనంతపురంలో జేసీ బ్రదర్స్‌ను ఎదుర్కొని ఒక హీరో అయ్యారు. ఆ తరువాత పోలీసాఫీసర్‌గా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తే ఆయనను జనం ఆదరించారు. దీంతో ఎంపీగా గోరంట్ల మాధవ్ విజయం సాధించారు. ఆ తరువాతే ఆయనలోని విలనిజం క్రమక్రమంగా బయటకు వచ్చింది. ఏకంగా ఓ మహిళతో న్యూడ్ వీడియో మాట్లాడి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. నేషనల్ మీడియా సైతం ఆ ఘనతను కవర్ చేసింది.
గీత దాటి మరీ వ్యాఖ్యలు..
చాలా కాలం పాటు గోరంట్ల మాధవ్ సైలెంట్ అయిపోయారు. పార్టీ కూడా ఆయనను పట్టించుకోలేదు. తాజాగా మరోసారి ఆయన జనంలోకి వచ్చారు. వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయ యాత్రలో భాగంగా హిందూపురంలో పర్యటించారు. ఈ సమయంలో ప్రత్యర్థి పార్టీ టీడీపీపై విమర్శలు సహజమే కానీ ఆయన గీత దాటి మరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ నోరు పారేసుకున్నారు. 2024 ఎన్నికల సమయంలోనే చంద్రబాబు ఛస్తాడని.. జగనే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని మాధవ్ వ్యాఖ్యానించారు.
జైలులో ఏమైనా కుట్ర జరుగుతోందా?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా తన తండ్రిని రాజమండ్రి సెంట్రల్ జైలులోనే హతమార్చేందుకు కుట్ర చేస్తున్నారని పలుమార్లు వ్యాఖ్యానించారు. ఇక తాజాగా గోరంట్ల మాధవ్ సైతం చంద్రబాబు ఛస్తాడంటూ వ్యాఖ్యలు చేయడం నారా లోకేష్ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. చంద్రబాబును జైలులో ఏమైనా చేయాలనే కుట్రలు జరుగుతున్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.చంద్రబాబు ఓటమి ఖాయం.. జగనే గెలుస్తారంటే అర్థముంది కానీ.. చంద్రబాబు చనిపోయి.. జగన్ గెలవడమేంటని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అంటే చంద్రబాబు ఉండగా విజయం సాధ్యం కాదని వైసీపీ అధిష్టానం భావిస్తోందా? ఈ క్రమంలోనే ఆయనకేమైనా హాని తలపెట్టనుందా? అని టీడీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఏదిఏమైనా రాజకీయ వర్గాల్లో గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు పెను దుమారమే రేపుతున్నాయి.