కోలీవుడ్ స్టార్ హీరో విజయ్-లోకేష్ కనగరాజ్ కలయికలో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన లియో మూవీ ఈ నెల 19 న దసరా స్పెషల్ గా విడుదలైంది. తమిళనాట ఎలా ఉన్నా లియో విడుదలైన మిగతా భాషల్లో లియో అంతగా ప్రేక్షకులని మెప్పించడంలో విఫలమైంది. లియో కి వచ్చిన సో సో టాక్ చూస్తే ఈ చిత్రం ప్లాప్ అవుతుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ డివైడ్ టాక్ తోనే లియో భారీ ఫిగర్స్ ని నమోదు చేస్తుంది. థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న లియో మూవీ ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.
లియో ప్యాన్ ఇండియా హక్కులని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఓటిటీ పార్ట్నర్ గా నెట్ ఫ్లిక్స్ లియో మూవీని నవంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ చేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. నవంబర్ 20 నుంచి లియో ఓటిటీలో స్ట్రీమింగ్ కాబోతుంది అని తెలుస్తుంది. లియో ఓటిటీ డేట్ పై నెట్ ఫ్లిక్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందట. మరి ఓటిటిలో లియో ని ఫ్యామిలీ ఆడియన్స్ ఎంత ఆదరిస్తారో చూడాలి.