హీరో వెంకటేష్ తన ఫ్యామిలీ విషయంలో చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తారు. ఆయన భార్య నీరజ, పిల్లలు మీడియాకి ఎక్కువగా కనిపించరు. వెంకీ పెద్ద కూతురు ఆశ్రీత కుకింగ్ వీడియోస్ తో ఫేమస్ అయ్యింది. ఇక చిన్న కుమార్తె హవ్యవాహిని ఎవరికీ పరిచయమే లేదు. వెంకటేష్ కి ఒక వారసుడు. కొన్నేళ్ల క్రితమే పెద్ద కుమార్తె ఆశ్రీత వివాహం చేసిన ఎంకటేష్ ఇప్పుడు చిన్న కుమార్తె హవ్యవాహిని వివాహం చెయ్యడానికి రెడీ అయ్యారు.
విజయవాడకి చెందిన డాక్టర్ ఫ్యామిలీతో వెంకటేష్ వియ్యమందుకోబోతున్నారు. నిన్న బుధవారం వెంకటేష్ చిన్న కుమార్తె హవ్యవాహిని నిశ్సితార్ధం జరిగిపోయింది. హైదరాబాద్ లోని వెంకటేష్ స్వగృహంలోనే ఈ నిశ్చితార్ధం వేడుక అంగరంగ వైభవంగా జరగడమే కాదు.. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరు, సూపర్ స్టార్ మహేష్ ఇంకా కొంతమంది ప్రముఖులు హాజరైనట్టుగా తెలుస్తుంది. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ, పెళ్లి కొడుకు ఫ్యామిలీతో పాటుగా మరికొంతమంది సన్నిహితులు ఈ నిశ్చితార్థంలో భాగమైనట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతం వెంకటేష్ చిన్న కుమార్తె నిశ్చితార్ధం ఫొటోస్ ఎక్కువగా బయటికి రాలేదు కానీ.. కొన్ని ఫొటోస్ మాత్రం వైరల్ గా మారాయి. ఇక హవ్య వాహిని పెళ్లి డిసెంబర్ మొదటి వారంలో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది.