నిన్న బుధవారం వైష్ణవ తేజ్ ఆదికేశవ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో యాంకర్ సుమ మీడియా వారిపై చేసిన జోక్ ఆమెని గట్టిగా ఇరికించింది. ఆ జోక్ ని మీడియా జర్నలిస్ట్ లు సీరియస్ గా తీసుకున్నారు. సుమ సారి చెప్పినా శాంతించలేదు. దానితో సుమ పర్సనల్ గా ఓ వీడియో రిలీజ్ చేసింది. అసలు విషయం ఏమిటంటే.. ఆది కేశవ ఈవెంట్ లో సుమ యాంకరింగ్ స్టార్ట్ చేస్తూ జర్నలిస్ట్ లు స్నాక్స్ ని భోజనాల్లా చేస్తున్నారు మీరు అది త్వరగా పూర్తి చేసుకుని వస్తే స్టార్ట్ చేద్దామంటూ మాట్లాడింది.
దానితో మీడియా వారు ఆగ్రహించి.. మీరు ఇలాంటి జోక్స్ జర్నలిస్ట్ లపై వెయ్యొద్దు అనగానే సుమ ఓ సారి అండి.. మీరు స్నాక్స్ స్నాక్స్ లానే తిన్నారు అంటూ మరోమారు మాట జారింది. దానితో మీడియా వారు అదే మానుకోవాలంటూ సుమని అక్కడే ఖండించారు. అప్పటికే సుమ సారి చెప్పింది. ఆ తర్వాత మీడియా వారంతా సుమ గారి కొడుకు హీరో అవుతున్నాడు.. సుమ గార్కి మీడియా వారు లోకువైపోయారంటూ కామెంట్స్ చేసారు.
దానితో సుమ అప్పటికప్పుడు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తూ మీడియా వారికి సారీ చెపింది. మీడియా వారితో తనకి సుదీర్ఘ అనుబంధం ఉందని, తాను కావాలని ఆ మాట ఉపయోగించలేదు. ఒక వేళ దానికి మీరు బాధపడి ఉంటే క్షమించండి అంటూ సారీ చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.