Advertisementt

సినిమాలకి మాత్రమే గ్యాప్ ఇచ్చింది..

Thu 26th Oct 2023 09:59 AM
samantha  సినిమాలకి మాత్రమే గ్యాప్ ఇచ్చింది..
Samantha post Ad shoot in mumbai సినిమాలకి మాత్రమే గ్యాప్ ఇచ్చింది..
Advertisement
Ads by CJ

సమంత ప్రస్తుతం సినిమాలకి మాత్రమే గ్యాప్ ఇచ్చింది. కమర్షియల్ గా ఆమె బ్రేక్ తీసుకోలేదు. నటనకు బ్రేకిచ్చి అమెరికా వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత వీలున్నప్పుడు రిబ్బన్ కటింగ్స్, అలాగే తన వస్త్ర దుకాణానికి సంబందించిన ప్రమోషన్స్ చేసుకుంటుంది. దుబాయ్ లో జ్యువలరి షాప్ ఓపెనింగ్ లో సందడి చేసిన సమంత ఎప్పుడెప్పుడు కొత్త సినిమా ఒప్పుకుంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈలోపులో ఆమె మళ్ళీ తన సాకి బ్రాండ్స్ ప్రమోషన్ కోసం ముంబై లో దిగింది.

ఎండు రోజుల క్రితం సమంత సాకి బ్రాండ్స్ కోసం ఫోటో షూట్స్ చేసింది. సమంత ఎప్పుడో సాకి అంటూ ఆన్ లైన్ దుస్తుల దుకాణాన్ని తెరిచింది. ఆ బట్టలని ఇలా సమంత ప్రమోట్ చెయ్యడం చూసిన వారంతా ఆమె సినిమాలకి మాత్రమే గ్యాప్ ఇచ్చింది.. కానీ ఇలాంటి వాటికి కాదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమా ప్రమోషన్స్ కి హెల్త్ రీజన్స్ చూపించే సమంత ఇలాంటి వాటిలో మాత్రం చాలా యాక్టీవ్ గా కనిపిస్తుంది అనే విమర్శలు కూడా ఉన్నాయి.

ఖుషి సినిమాలో సమంత లుక్స్ పై చాలా విమర్శలొచ్చాయి. ప్రస్తుతం సమంత హెల్త్ ట్రీట్మెంట్ తో పాటుగా తన లుక్స్ పై కూడా శ్రద్ద పెట్టినట్లుగా తెలుస్తుంది.

Samantha post Ad shoot in mumbai:

Samantha Ruth Prabhu Spotted after an Ad Shoot in Mumbai

Tags:   SAMANTHA