Advertisementt

దేవర నుంచి ఎగ్జైటింగ్ అప్డేట్

Wed 25th Oct 2023 07:48 PM
devara  దేవర నుంచి ఎగ్జైటింగ్ అప్డేట్
Exciting update from Devara దేవర నుంచి ఎగ్జైటింగ్ అప్డేట్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా ఫిలిం దేవర మూవీ షూటింగ్ కూల్ గా చక చకా జరిగిపోతుంది. పక్కా ప్లానింగ్ తో పక్కా స్క్రిప్ట్ తో కొరటాల షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. దేవర ని రెండు భాగాలుగా విడుదల చేస్తామంటూ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ కూడా కొరటాలకి అందుబాటులో ఉంటూ షూటింగ్ ని జెట్ స్పీడులో పూర్తి చేస్తున్నాడు.

అయితే ఎక్కువగా హైదరాబాద్ లోనే శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోనే దేవర షూటింగ్ ని పూర్తి చేస్తోంది టీమ్. స్పెషల్ గా వేసిన సెట్స్ లో దేవర షూటింగ్ చిత్రీకరణ చేపట్టారు. సినిమాలో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ మొత్తాన్ని ఆ స్పెషల్ సెట్స్ లోనే పూర్తి చేసారు. అయితే ఇప్పుడు మొదటిసారి దేవర టీమ్ గోవాకి పయనమవ్వబోతుంది. ఓ ఫ్రెష్ షెడ్యూల్ ని గోవాలో సెట్ చేశారట. ఈ షూట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సహా హీరోయిన్ జాన్వీ కపూర్ పై సన్నివేశాలు తెరకెక్కిస్తారని తెలుస్తుంది. 

హైదరాబాద్ లో ఎక్కువగా యాక్షన్ బ్లాక్ లోనే నటించిన ఎన్టీఆర్ ఫైనల్ గా రొమాంటిక్ మూడ్ లోకి వచ్చాడు. ఇప్పటివరకు జాన్వీ కపూర్ కూడా దేవర సెట్స్ లో అడుగుపెట్టినట్లుగా ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్ప్పుడు ఈ గోవా షెడ్యూల్ లో జాన్వీ కపూర్ అడుగుపెట్టబోతుంది. 

Exciting update from Devara:

 Devara shooting update 

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ