Advertisementt

బిగ్ బాస్ 7: శోభా vs తేజ

Wed 25th Oct 2023 06:11 PM
bigg boss 7  బిగ్ బాస్ 7: శోభా vs తేజ
Bigg Boss 7: Sobha Shetty vs Teja బిగ్ బాస్ 7: శోభా vs తేజ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 లో స్నేహితులు శత్రువులుగా మారిపోతున్నారు. హౌస్ లోకి ఎంటర్ అయినప్పటినుంచి స్నేహితులుగా ఉంటున్న తేజ-శోభా శెట్టిలు మొన్న నామినేషన్స్ విషయంలోనే గొడవపడ్డారు. తేజని శోభా శెట్టి నామినేట్ చేయడంపై బాగా ఫీలయ్యాడు. 12 మంది నన్ను నామినేట్ చేసినా నేను ఫీలయ్యేవాడిని కాదు, నువ్ చేసినందువలనే ఫీలయ్యాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక తర్వాత కూడా వీరి మధ్యలో శివాజీ గొడవ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. 

తేజ ఆమెని ఎక్కువగా సపోర్ట్ చెయ్యొద్దు అంటూ శివాజీ చెప్పిన ప్రోమోస్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈరోజు ఎపిసోడ్ లో శోభకు తేజకి మధ్యన పెద్ద గొడవే జరిగింది. ఆ గొడవ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈరోజు కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా తేజకి శోభా శెట్టికి చిన్నగా మొదలైన గొడవ చివరికి పెద్దగా మారిపోయింది. నేను వినను తేజ అంటూ శోభా శెట్టి వెళ్లిపోతుంటే.. హే పోవమ్మా అంటూ తేజ గట్టిగా అరిచేసాడు. నాకక్కర్లేదు పో అన్నాడు తేజ.

తర్వాత శోభా శెట్టి కూడా తేజపై ఫైర్ అయ్యింది. ఏమి లేనిదానికి పెద్దది చెయ్యమాకు నువ్వు అంటూ తేజ శోభ శెట్టిని కన్విన్స్ చెయ్యడానికి ప్రయత్నం చేసినా ఆమె ఆగలేదు. తర్వాత నేను సరదాగా అన్నాను అన్నా అంటూ శివాజీకి చెప్పాడు తేజ.. అప్పుడు శివాజీ ఏది ఎక్కువైనా ఇలానే ఉంటుంది వదిలేయ్యండి అంటూ తేజని శాంతింపజెయ్యడానికి ట్రై చేసిన ప్రోమో వైరల్ గా మారింది. 

Bigg Boss 7: Sobha Shetty vs Teja:

Bigg Boss 7 latest promo viral

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ