Advertisementt

పవన్ ఫాన్స్ కి క్లారిటీ వచ్చినట్టే

Wed 25th Oct 2023 12:21 PM
pawan kalyan  పవన్ ఫాన్స్ కి క్లారిటీ వచ్చినట్టే
As if Pawan fans got clarity పవన్ ఫాన్స్ కి క్లారిటీ వచ్చినట్టే
Advertisement
Ads by CJ

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాలు అంటూ బిజీగా కనిపిస్తున్నారు. టీడీపీతో పొత్తు తర్వాత జనసేన బలం పెరిగింది. ఇటు ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే OG చిత్రాలు షూటింగ్స్ అంటూ హైదరాబాద్-అమరావతి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ మూడేళ్ళ క్రితమే మొదలు పెట్టి షూటింగ్ చేసిన హరి హర వీరమల్లు ఆల్మోస్ట్ అటకెక్కినట్టే అంటూ ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ఏడాది కాలంగా షూటింగ్ ప్రోగ్రెస్ లేదు. హరి హర వీరమల్లు మొదలు పెట్టాక ఆయనవి రెండు సినిమాలు విడుదలయ్యాయి.

మరో రెండు సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. కానీ గత ఏడాది నవంబర్, డిసెంబర్ లో ఆపేసిన వీరమల్లు షూటింగ్ ఇప్పటి వరకు మొదలు కాలేదు. నిర్మాత ఏఎం రత్నం మాత్రం వీరమల్లు గురించి అప్పుడప్పుడు  అప్ డేట్స్ ఇస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వీరమల్లు టీజర్ అన్నారు అదీ లేదు. క్రిష్ కొద్దిరోజులుగా వీరమల్లు గురించి ఎక్కడా మాట్లాడింది లేదు. తాజాగా దసరా ఆయుధపూజ రోజున OG, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవన్ కళ్యాణ్ స్పెషల్ పోస్టర్స్ వచ్చాయి.

కానీ హరి హర వీరమల్లు నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీనితో ఇకపై ఈ సినిమా పట్టాలెక్కదు అని పవన్ ఫ్యాన్స్ కి  క్లారిటీ వచ్చేసింది. ఒకవేళ సినిమా ప్రోగ్రెస్ ఉంటే ఏదో ఒక పోస్టర్ వదిలేవారు. ఆ మధ్యన వీరమల్లు సెట్ అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఆ తర్వాత మళ్ళీ వీరమల్లు ముచ్చట లేనే లేదు. క్రిష్ మౌనం కూడా ఈ వీరమల్లు ఆగిపోయింది అనడానికి ఊతమిస్తుంది. 

As if Pawan fans got clarity:

Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Shelved?

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ