Advertisementt

జైలర్ విలన్ అరెస్ట్

Wed 25th Oct 2023 09:34 AM
jailer vinayakan  జైలర్ విలన్ అరెస్ట్
Jailer villain arrested జైలర్ విలన్ అరెస్ట్
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ లో మెయిన్ విలన్ గా కనిపించిన వినాయకన్ ని పోలీసులు అరెస్ట్ చెయ్యడం కలకలం సృష్టించింది. జైలర్ మూవీలో క్రూరమైన విలనిజాన్ని చూపించిన వినాయకన్ ని షూటింగ్ లో భాగంగా అరెస్ట్ చెయ్యడం కాదు.. నిజంగానే కేరళ పోలీసులు అరెస్ట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. కేరళకి చెందిన వినాయకన్ ప్రస్తుతం తమిళ సినిమాలతో ఫేమస్ అవుతున్నాడు. తెలుగులోనూ అతను నటించాడు. మలయాళంలో పలు చిత్రాల్లో నటించాడు. 

అయితే వినాయకన్ మద్యం సేవించి పబ్లిక్ ప్లేస్ లో రచ్చ చెయ్యడంతో.. అక్కడున్నవారు వినాయకన్ ని అదుపు చేసేందుకు ప్రయత్నం చేసినా వినాయకన్ వినకపోయేసరికి వారు పోలీసులని సంప్రదించగా.. కేరళ పోలీసులు వినాయకన్ ని అదుపులోకి తీసుకోవడమే కాకుండా.. అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. అయితే వినాయకన్ కి తాగేసి గొడవ చేయడమనేది ఇదేం కొత్త కాదట. గతంలోనూ అతను పలుమార్లు ఇలానే ప్రవర్తించాడంటూ అక్కడి స్థానికులు చెబుతున్న మాట. 

Jailer villain arrested:

Jailer actor Vinayakan Arrest 

Tags:   JAILER VINAYAKAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ