Advertisementt

అప్పుడు ప్రభాస్ ఇప్పుడు మెగాస్టార్

Tue 24th Oct 2023 09:47 PM
rana  అప్పుడు ప్రభాస్ ఇప్పుడు మెగాస్టార్
Then Prabhas, now megastar అప్పుడు ప్రభాస్ ఇప్పుడు మెగాస్టార్
Advertisement
Ads by CJ

రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలిలో హీరో ప్రభాస్ బాహుబలి కేరెక్టర్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో ప్రభాస్ విలన్ గా పోటీ పడిన భళ్ళాలదేవుడు రానాకి అంతే క్రేజ్ వచ్చింది. ప్యాన్ ఇండియా లెవల్లో రానా అందరి మనసుల్లో భళ్లాలదేవుడిగా ఉండిపోయాడు. ఇప్పటికి రానాని అందరూ సరదాగా భల్లాలదేవుడు అనే పిలుస్తుంటారు. ఆ కేరెక్టర్ కి ప్రేక్షకుల్లో అంత ఇంపాక్ట్ ఉంది. ఇక అప్పుడు ప్రభాస్ కి విలన్ గా మెప్పించిన రానా.. మెగాస్టార్ కోసం విలనిజాన్ని ప్రదర్శించడానికి రెడీ అవుతున్నాడట.

బింబిసార దర్శకుడు వసిష్ఠ తో మెగాస్టార్ చిరు మెగా156 మూవీని స్టార్ట్ చేస్టున్నారు. దసరా సందర్భంగా మ్యూజిక్ సెట్టింగ్స్ కోసం పూజా కార్యక్రమాలు కూడా జరిపించిన ఈ మూవీని యువీ క్రియేషన్స్ వారు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నాడు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ కి చోటు ఉండబోతుంది అని.. పియాడికల్ డ్రామాగా ఉండబోతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ తో ఢీ కొట్టేందుకు హీరో రానాని దర్శకుడు సంప్రదించాడనే టాక్ మొదలయ్యింది.

వశిష్ట విలన్ పాత్రకోసం రానాని సంప్రదించడం, రానా ఓకే చెప్పడం జరిగిందని మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్నన్యూస్. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్స్ గా అనుష్క, నయనతార పేర్లని పరిశీలిస్తున్నాడట దర్శకుడు. మరి దసరా సందర్భంగా వదిలిన పోస్టర్ అలాగే వీడియో చూస్తే ఈ చిత్రం ఎలా ఉండబోతుందో అనేది ప్రేక్షకులు ఓ ఐడియాకి వచ్చేస్తున్నారు.

Then Prabhas, now megastar:

Rana Daggubati to Play Villain in Mega 157

Tags:   RANA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ