Advertisementt

సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పవన్

Tue 24th Oct 2023 08:12 PM
pawan kalyan  సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పవన్
Pawan is being trolled on social media సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పవన్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై ప్యాకేజి స్టార్, మూడు పెళ్ళాలు, విడాకుల పవన్ అంటూ విరుచుకుపడుతూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చిన రాతలు రాస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన సినిమాల విషయంలో యాంటీ ఫాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అదేమిటంటే పవన్ కళ్యాణ్ తాను చేస్తున్న సినిమా టైటిల్ ని త్పపుగా పలికి నాలుక కొరుకున్న వీడియోని ట్రెండ్ చేస్తూ ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు.

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మహా మాక్స్ ఛానల్ ఓపెనింగ్ లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఫ్లోలో తాను నటిస్తున్న సినిమాని.. సర్దార్ భగత్ సింగ్ అంటూ టైటిల్ ను తప్పుగా పలకగా, కొందరు వీడియో క్లిప్ లను వైరల్ చేస్తూ పవన్ కళ్యాణ్ కి తాను నటిస్తున్న సినిమా టైటిల్ కూడా మర్చిపోయాడు, తన సినిమా టైటిల్స్ ని పలకడం కూడా రావడం లేదు.. సర్ధార్ ఏమిటి పవన్.. మనం ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ఆ వీడియో క్లిప్ ని నెట్టింట వైరల్ చేస్తూ పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తున్నారు.

అది చూసిన ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ట్విట్టర్లో రియాక్ట్ అవుతూ.. హ్యుమిలియేషన్? వాట్ ఏ వర్డ్.. పర్లేదు గుర్తు చేయడానికి, గుర్తుండిపోయే సినిమా తీయడానికి, మేమంతా కష్టపడుతున్నాం అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారగా..పవన్ కళ్యాణ్ యాంటీ ఫాన్స్ మాత్రం ఆయన్ని సోషల్ మీడియా వేదికగా ఆడేసుకుంటున్నాడు. 

కొన్ని ట్రోలింగ్ ట్వీట్స్ 

Sardar... Bhavadeeyudu...ahhh Ustadd😝😜 kasepu aagi OG kuda anestadu😂😂😂😂😂

Sardar bhagat Singh is the full name of Bhagat Singh. So flow lo aa name vachesindi 

@PawanKalyan  ki 😅

Pawan is being trolled on social media:

 Pawan Kalyan forgot the title of his current movie

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ