Advertisementt

వచ్చే వారం ఇండియాకి ప్రభాస్

Tue 24th Oct 2023 07:29 PM
prabhas  వచ్చే వారం ఇండియాకి ప్రభాస్
Prabhas to India next week వచ్చే వారం ఇండియాకి ప్రభాస్
Advertisement
Ads by CJ

గత కొద్ది రోజులుగా ప్రభాస్ ఇండియాలో లేరు. ఆయన తన నీ సర్జరీ కోసం అమెరికా వెళ్లారు. సలార్ షూటింగ్ పూర్తి కావడంతో ప్రభాస్ మారుతి మూవీని, కల్కి మూవీ షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి అమెరికా వెళ్లిపోయారు. అప్పటి నుంచి అమెరికాలోనే ఉన్న ప్రభాస్ కొద్ది రోజుల క్రితమే సర్జరీ చేయించుకున్నారు. ప్రసుతం రెస్ట్ లో ఉన్నారు. నిన్న ప్రభాస్ బర్త్ డే రోజున ఆయనకి సోషల్ మీడియా లో సినీ ప్రముఖుల విషెస్ తో పాటుగా ఆయన నటించిన సినిమాల నుంచి ప్రభాస్ కి బర్త్ డే విషెస్ చెబుతూ కొత్త పోస్టర్స్ వదిలారు.

కల్కి నుంచి, సలార్ ఉంచి ప్రభాస్ కి బర్త్ డే విషెస్ పోస్టర్ తో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. అయితే ప్రభాస్ ఇండియా లో లేకపోవడంతో ప్రభాస్ ఫాన్స్ కాస్త ఫీలైనా.. కేక్ కటింగ్స్ తో ఆయన బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ వచ్చే వారం ఇండియాకి రాబోతున్నారు. అమెరికాలో రెస్ట్ తీసుకుంటున్న ఆయన వచ్చే వారం ఇండియాకి రావడము, నవంబర్ 10 నుంచి మారుతి మూవీ అలాగే కల్కి షూటింగ్స్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.

ఇక నవంబర్ చివరి నుంచి సలార్ ప్రమోషన్స్ లో జాయిన్ అవుతారని.. ఈసారి ప్రభాస్ ముంబై, చెన్నై, బెంగుళూరు, హైరాబాద్ లలో సలార్ ప్రమోషన్స్ ని భారీగా చేయబోతున్నారని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ ఆ మేరకు ప్లానింగ్ రెడీ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. 

Prabhas to India next week:

Prabhas to India 

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ