Advertisementt

రాధ పెళ్లి: ట్రోల్ అవుతున్న నాని, వంశీ

Tue 24th Oct 2023 02:08 PM
nani,vallabhaneni vamsi  రాధ పెళ్లి: ట్రోల్ అవుతున్న నాని, వంశీ
Radha wedding: Nani and Vamsi being trolled రాధ పెళ్లి: ట్రోల్ అవుతున్న నాని, వంశీ
Advertisement
Ads by CJ

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. వంగవీటి రాధ పెళ్లి కొడాలి నాని, వల్లభనేని వంశీల ట్రోలింగ్‌కు కారణమైంది. అసలు వంగవీటి రాధ పెళ్లి అయితే వారిద్దరిపై ట్రోలింగ్ ఎందుకు జరిగిందంటారా? దీనికి కారణం లేకపోలేదు. ఈ వివాహంలోనే వల్లభనేని వంశీ, కొడాలి నానిల స్టామినా ఏంటో జనానికి తెలిసింది. నిజానికి మీడియా ముందుకు వచ్చింది మొదలు బూతులకు పని చెబుతుంటారు. కొడాలి నానికి అయితే ఏకంగా బూతుల ఎమ్మెల్యే అని పేరు వచ్చేసింది. అంతలా అసభ్య పదజాలంతో ప్రతిపక్ష నేతలను కించపరిచారు. ఈ క్రమంలోనే జనాల్లో వీరిపై బీభత్సమైన అసహనం పెరిగింది. వారిని ప్రజాప్రతినిధుల మాదిరిగా కూడా జనం చూడటం మానేశారు.

వేదిక నుంచి దిగిపోయిన వంశీ..

తాజాగా వంగవీటి రాధ వివాహంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వంగవీటి రాధ వివాహ వేడుకకు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ అక్కడకు చేరుకున్నారు. అయితే కామన్‌గానే పవన్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. అయితే ఈ తరుణంలో వేదిక మీద ఉన్న నాని, వంశీలను జనం వెనక్కు నెట్టేశారు. ఈ క్రమంలోనే పవన్ అభిమానుల,సెక్యూరిటీల తోపులాటలో వల్లభనేని వంశీ వేదిక మీద నుంచి దిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని షేర్ చేసిన పవన్ అభిమానులు ఆయన స్టామినా ఏంటో చూశారా? అని ప్రశ్నిస్తున్నారు.

జస్ట్ ఇది శాంపిల్ మాత్రమే..

సదరు వైసీపీ నేతలను పవన్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ నేతలంతా ప్యాకేజీ స్టార్, పెళ్లిళ్ల మ్యాటర్ తీసుకొస్తూ.. పవన్‌పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ పవన్‌తో పాటు ఇద్దరు కీలక వైసీపీ నేతలు ఒకే వేదికపైకి వచ్చినప్పుడు జనాల్లో ఎవరికెంత క్రేజ్ ఉందనేది అర్థమైందంటూ నెటిజన్లు అంటున్నారు. పవన్ అభిమానులు సైతం పవన్ స్థాయి ఏంటో చూడాలంటూ వీడియోను వైరల్ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు సైతం కొడాలి నాని, వల్లభనేని వంశీకి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనని.. ముందుంది ముసళ్ల పండుగ అంటూ విమర్శిస్తున్నారు. మొత్తానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ తెగ ట్రోల్ అవుతున్నారు.

Radha wedding: Nani and Vamsi being trolled:

Nani Vallabhaneni Vamsi Was Embarrassed In Vangaveeti Radha Wedding

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ