Advertisementt

సంక్రాంతికి తగ్గదేలే అంటున్న హను-మాన్

Tue 24th Oct 2023 01:31 PM
hanu-man  సంక్రాంతికి తగ్గదేలే అంటున్న హను-మాన్
Team Hanu-Man Extends Happy Dussehra Wishes సంక్రాంతికి తగ్గదేలే అంటున్న హను-మాన్
Advertisement
Ads by CJ

వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీస్ రావడానికి రెడీగా ఉన్నాయి. ప్రభాస్ కల్కి విషయం తేలడం లేదు. అది పోస్ట్ పోన్ అవ్వొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. మరి సంక్రాంతి అంటే మాములు విషయం కాదు. అందుకే చాలామంది హీరోలు అదే డేట్స్ ని లాక్ చేస్తున్నారు. అయితే ఎన్ని సినిమాలు బరిలో ఉన్నా తేజా సజ్జ  తన హను-మాన్ ని సంక్రాంతికే తేవాలని మళ్ళీ మళ్ళీ డిసైడ్ అవుతున్నాడు. మరోసారి దసరా పోస్టర్ తో అదే విషయాన్ని కన్ ఫర్మ్ చేసారు.

 ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం హను-మాన్‌. తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాలో కొంత హై-ఎండ్  వీఎఫ్ఎక్స్ ఉంటుంది కాబట్టి టీమ్ పోస్ట్ ప్రొడక్షన్‌కి తగిన సమయాన్ని కేటాయిస్తుంది.

తాజాగా హనుమాన్ టీమ్.. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ, కథానాయకుడు మీసాలు తిప్పుతూ కనిపించారు. అతని షేడ్స్  గ్లాస్ లో  వినయ్ రాయ్ పోషించిన విలన్ ఇమేజ్ ని ప్రజెంట్ చేస్తోంది, అతను రావణుడి దిష్టిబొమ్మ వెనుక నిలబడి కనిపించాడు. తొమ్మిది తలలుగా చూపబడిన డ్రోన్లతో ఆ పాత్ర రావణాసురుడిని ప్రతిబింబిస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా నాడు రావణ దహనం చేసే సంప్రదాయం వుంది. మేకర్స్ త్వరలో కొన్ని  ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లతో రానున్నారు.

హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్‌తో సహా పలు భారతీయ భాషలలో జనవరి 12, 2024న పాన్ వరల్డ్ విడుదల కానుంది.

Team Hanu-Man Extends Happy Dussehra Wishes:

Team Hanu-Man Extends Happy Dussehra Wishes, Release On January 12, 2024

Tags:   HANU-MAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ