పవన్ కళ్యాణ్ ఫాన్స్ తనకి వార్నింగ్ ఇస్తున్నారంటూ రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. టైగర్ నాగేశ్వరావు ప్రమోషన్స్ లో భాగంగా నేను ఇంటర్వూస్ ఇస్తున్నాను, పవన్ ఫాన్స్ నా సోషల్ మీడియా అకౌంట్స్ లో నాకు వార్నింగ్ ఇస్తూ కామెంట్స్ పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడొద్దు అంటూ మెసేజెస్ చేస్తున్నారు. నేను పవన్ గురించి ఎప్పుడూ నిజాలే మాట్లాడాను. విడాకులు సమయంలో జరిగినవి, మొన్న నేను వీడియో విడుదల చేసింది అన్నీ నిజాలే. అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
నేను పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా, లేదా.. అనేది కోరుకుంటూ, దేవుడు ఎలా చేస్తే అలా జరుగుతుంది. ఆయన సీఎం అవుతారో, లేదో అనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. కనీసం ఓ కామన్ మ్యాన్ గా కూడా సపోర్ట్ చెయ్యను. ఫలానా వాళ్ళని సీఎం చెయ్యమని నేను ఎన్నికల ప్రచారం చెయ్యను. అది నాకు అవసరం లేని విషయం.. ఇక నేను నా లైఫ్ లో రెండో పెళ్లి చేసుకుంటాను. అది ఖచ్చితంగా జరుగుతుంది.
నేను నా కూతురు ఆద్య కోసమే పెళ్లి చేసుకోలేదు. దాని గురించే వెయిట్ చేస్తున్నాను. నాకు నా పెద్దవాళ్ళ సపోర్ట్ కూడా లేదు. నేను సింగిల్ మథర్ గా పిల్లలని పెంచుకుంటున్నాను. నాకు హెల్త్ కూడా అంతగా సహకరించడం లేదు అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇక పవన్ విషయంలో ఆయన ఫాన్స్ ఏమి మారలేదు. నన్ను ఇప్పటికి ఇబ్బంది పెడుతున్నారంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది.