బిగ్ బాస్ సీజన్7 లో శోభా శెట్టి, ప్రియాంక లు ఇతర కంటెస్టెంట్స్ పై నోళ్లు ఏసుకుని పడిపోతున్నారు. వారి సీరియల్ పైత్యం మిగతా కంటెస్టెంట్స్ పై చూపిస్తున్నారు. గత వారం భోలే విషయంలో జరిగిన గొడవలో నాగార్జున ప్రియాంక ని శోభని మెచ్చుకోవడంతో వారు ఈ వారం కూడా రెచ్చిపోయారు. భోలే సారి చెప్పినా వారు వినడమే లేదు. నేనింతే అంటూ శోభా శెట్టి రెబల్ గా మాట్లాడుతుంది. వాళ్ళని చూస్తే నెటిజెన్స్ కూడా ఇరిటేట్ అవుతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.
శివాజీ కూడా శోభా శెట్టి నువ్వు భోలే సారిని యాక్సెప్ట్ చెయ్యలేదు అంటూ ఆమెని నామినేట్ చెయ్యగానే మరింతగా రెచ్చిపోయింది శోభా శెట్టి. ఇక ప్రియాంక అయితే నోరేసుకుని పడిపోతుంది. ఆమెని నామినేట్ చేసిన యావర్ పై విరుచుకుపడింది.అశ్విని తో శోభా, ప్రియాంక గొడవకి దిగారు. అమ్మాయిలు స్మూత్ గా ఉంటారు కానీ.. వీళ్ళు సీరియల్ లో రెచ్చిపోయినట్టుగా రెచ్చిపోయి చిరాకు తెప్పిస్తున్నారంటూ బుల్లితెర ప్రేక్షకులు మాట్లాడుతున్నారు.