రాజమండ్రి వేదికగా జరిగిన టీడీపీ-జనసేన ఉమ్మడి సమావేశం ముగిసింది. మూడు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో.. ప్రధానంగా ఆరు అంశాలపై చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి కార్యాచరణ సహా పలు అంశాలపై ఇరు పార్టీల మధ్య సమాలోచనలు జరిగాయి. అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ యువనేత నారా లోకేష్ కలిసి మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇరువురూ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. వైసీపీ అరాచకాలను కట్టడి చేయాలని నిర్ణయించారు.
అందర్నీ ఇబ్బంది పెట్టారు!
"చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం..తను ఏపీలో అడుగుపెట్టకుండా చేయటం అందరికీ తెలుసు. వైసీపీ దాడి చేయని పార్టీ ఏపీలో లేదు. అచ్చెన్నాయుడు నుంచి చంద్రబాబు వరకు చాలా మందిని ఇబ్బందిపెట్టారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనియ్యం. 2014లో కూడా టీడీపీకి మద్దతిచ్చాం. వైసీపీ అక్రమాలు, దోపీడీకి మేము వ్యతిరేకం. వైసీపీ 30 వేల కోట్లు ఇసుక దోపీడీ చేయటం. వైసీపీ తెగులు రాష్ట్రానికి పట్టుకొంది. వైసీపీ తెగులు నిర్మూలించటానికి టీడీపీ- జనసేనే వ్యాక్సిన్. చంద్రబాబుకు బెయిల్ రాకుండా టెక్నికల్‌గా అడ్డుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం పోవాలి. ఏపీ భవిష్యత్ కోసం చారిత్రాత్మక పొత్తుకు శ్రీకారం చుట్టాం. కక్షతో చంద్రబాబును వేధించి జైల్లో మగ్గేలా వైసీపీ ప్రభుత్వం చేస్తోంది. ఆయన్ను అక్రమంగా, అకారణంగా జైల్లో పెట్టారని.. సాంకేతిక అంశాల పేరుతో బెయిల్ రాకుండా చేస్తున్నారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు, చంద్రబాబుకు మద్దతు ఇచ్చేందుకే రాజమహేంద్రవరంలో టీడీపీ నేతలతో భేటీ నిర్వహించాం. జనసేన- టీడీపీ ప్రభుత్వం రావాలి. ఎన్నికలకు 120 రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రజలకు భరోసా ఇవ్వటం.. సుస్థిర పాలన అందించటమే ఉమ్మడి లక్ష్యం. టీడీపీ- జనసేన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ రాజమండ్రి లోనే విజయోత్సవ సభ ఏర్పాటు చేస్తాం" అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
ఏమీటో ఘోరాలు!
"ఏపీలో సామాజిక దోపీడీ జరుగుతుంది. ఎస్సీలు, బీస్సీలను వైసీపీ నేతలు వెంటాడి చంపుతున్నారు. కరువు, జగన్ కవల పిల్లలు. 34 లక్షల హెక్టార్లలో పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. చంద్రబాబును 44 రోజులు పాటు జైలులో పెట్టారు
నవంబర్-01న మెనిపెస్టో రూపకల్పన చేస్తాం. సమన్వయ కమిటీలో మూడు తీర్మానాలు చేశాం. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించటం.. ప్రజల పక్షాన పోరాటం చేయటం..
2024 లో టీడీపీ, జనసేన ప్రభుత్వం వస్తోంది. జనసేన, టీడీపీ కార్యకర్తలు సీనియర్ నాయకులు కలిసి పనిచేయటం రాష్ట్ర భవిష్యత్తే లక్ష్యం " అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.