ఒకే ఒక్క లేఖ.. ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పేరిట రిలీజ్ అయిన లేఖతో వైసీపీలో వణుకు మొదలైంది. జైల్లో ఉన్నా.. ప్రజా సంక్షేమం కోసమే బాబు ఆలోచిస్తున్నట్లు ఉన్న ఈ లెటర్ గురించే తెలుగు ప్రజలు చర్చించుకుంటున్నారు. ములాఖత్ సందర్భంగా కుటుంబ సభ్యులకు చంద్రబాబు చెప్పిన మాటలను లేఖ రూపంలో రాయడంలో తప్పేముంది..? అనేది నారా ఫ్యామిలీ వాదన. ఆ లేఖ అస్సలు జైలు నుంచి రిలీజ్ కాలేదని.. అక్కడేమీ జరగకపోయినా ఏదో అయిపోయిందనేలా జైలు అధికారులు సీన్ క్రియేట్ చేసేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ఏపీ డీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డి దాకా వచ్చి ఆగింది. ఆయన స్పందనతో ఏదో నయ వంచన ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. చంద్రబాబు రాసినట్లు ప్రచారం జరుగుతున్న ఈ లేఖపై విచారణ జరుపుతామని డీజీపీ ప్రకటించారు. అంతేకాదు.. జైల్లో చంద్రబాబు ఎలా ఉన్నారు..? భద్రత ఎలా ఉందనే విషయాలపై కూడా ఏవేవో డీజీపీ చెప్పుకొచ్చారు.
పాత చింతకాయే..!
అదేదో సామెత ఉంది కదా.. పాత చింతకాయ పచ్చడిలాగే ఆదివారం నాడు జైలు అధికారులు చెప్పిన విషయాలనే డీజీపీ కూడా అరిగిపోయిన క్యాసెట్‌లాగా వినిపించారు. బాబు పేరిట వైరల్ అవుతున్న లేఖపై దర్యాప్తు జరుగుతోందని.. జైలు అధికారికి తెలియకుండా ఎవరూ ఎటువంటి లేఖలు రాయరు.. రావు అని స్పష్టం చేశారు. జైలు నుంచి ఎలాంటి లెటర్ రిలీజ్ కాలేదని.. విచారణ జరిపిన తర్వాత ఈ వ్యవహారంలో తప్పుకుండా చర్యలు ఉంటాయని రాజేంద్రనాథ్ చెబుతుండటం గమనార్హం. జైల్లో చంద్రబాబుకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్నారు. ఆయన భద్రత కోసం జైల్లో అదనపు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాబు భద్రత విషయంలో ఎటువంటి రాజీ లేదన్నారు. ఇటీవల పుంగనూరులో జరిగిన ఘటనపై కేసులు నమోదు చేశామన్నారు. భువనేశ్వరి యాత్ర అనుమతి కోసం ఇంకా మమ్మల్ని ఎవరూ కలవలేని.. కలిస్తే అప్పుడు ఆలోచిస్తామన్నారు.
మరీ టూ మచ్ బాసూ..!
చంద్రబాబు పేరిట లేఖ రిలీజ్ అయ్యింది.. ఆ లేఖను ఎతామే రిలీజ్ చేశామని కూడా కుటుంబ సభ్యులు క్లియర్ కట్‌గా చెప్పారు. ములాఖత్ సందర్భంగా బాబు చెప్పిన విషయాలనే లెటర్‌లో రాసినట్లు రాసిన లేఖ అని కూడా చెప్పారు కదా..? ఇందులో గోప్యత ఇంకేముంది..? దీనిపైన మళ్లీ విచారణ కూడా..? అసలు జైలు అధికారులు మొదలుకుని డీజీపీ వరకు ఎవరేం మాట్లాడుతున్నారో.. ఎలా ప్రవర్తిస్తు్న్నారో.. ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావట్లేదని సామాన్య ప్రజలు, టీడీపీ శ్రేణులు తిట్టిపోస్తున్న పరిస్థితి. ఇంత క్లారిటీ చెప్పినప్పటికీ ఈ వ్యవహారాన్ని ఏదోవిధంగా వైసీపీకి ప్లస్ కావాలనే డీజీపీ చూస్తున్నారంటే.. ఇక చేయడానికేముంది.. ఇంతకంటే వంచన మరొకటి ఉండదేమోనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదంతా ఎందుకు ప్రశాంతంగా వైసీపీ కండువా కప్పుకుంటే సరిపోతుంది కదా..? అని తెలుగు తమ్ముళ్లు సూచిస్తున్న పరిస్థితి. సారుగారు ఎంక్వయిరీ ఏమని చేయిస్తారో.. ఏం తేలుతుందో.. దీనిపై ఇంకెంత సీన్ క్రియేట్ చేస్తారో చూస్తూ ఉండాలి మరి.