బిగ్ బాస్ సీజన్ 7 లో రైతు బిడ్డ ట్యాగ్ తో సింపతీ గేమ్ ప్లే చేస్తున్న పల్లవి ప్రశాంత్ ని ఆ టాగ్ మాత్రమే కాపాడుతుంది. టాస్క్ పెరఫార్మెన్స్ ఎలా ఉన్నా నామినేషన్స్ లో పైత్యం చూపిస్తున్నాడంటూ నెటిజెన్స్ కూడా మాట్లాడుతున్నారు. హౌస్ లో శివాజీ వెనకాలే తిరుగుతూ ఉండే పల్లవి ప్రశాంత్ అంటే హౌస్ మేట్స్ లో చాలామందికి పడదు. కానీ అతన్ని అంటే ఎక్కడ తమ క్రేజ్ తగ్గిపోతుందో, ప్రేక్షకులు యాంటీ అవుతారో అని కొంతమంది కామ్ గా ఉంటున్నారు. మొదట్లో అమరదీప్ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసి బయట ట్రోల్ అయ్యాడు.
అయితే గత వారం నామిషన్స్ లో పల్లవి ప్రశాంత్ ని సందీప్ మాస్టర్ నామినేట్ చేసాడని.. నువ్ నన్ను ఊరోడా అన్నావంటూ సందీప్ మాస్టర్ పై నింద వేసాడు. కాని సందీప్ నేను అనలేదు అంటూ భర్య జ్యోతి, తన డాన్స్ పై ఒట్టు వేసాడు. అప్పుడు పల్లవి ప్రశాంత్ సందీప్ ని గట్టిగా టార్గెట్ చేసాడనిపించింది. అదే విషయాన్ని శనివారం ఎపిసోడ్ లో నాగార్జున బయటికి తీశారు. ప్రశాంత్ నింద వేసేముందు ఆలోచించుకోవాలి అన్నారు. నేను అలా అనలేదు సర్ అంటూ ప్రశాంత్ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావ్ అంటూ నాగార్జున అడిగారు.
ఇక పూజ నువ్ చెప్పమ్మా పల్లవి ప్రశాంత్ సందీప్ మాస్టర్ పై నింద వేశాడా అని అడిగితే అవును సర్.. పల్లవి ప్రశాంత్ తనని ఊరోడా అని సందీప్ మాస్టర్ అన్నటుగా ఆరోజు చెప్పి ఈరోజు ఇలా అనలేదు అంటున్నాడని అంది. ఇక అర్జున్ కూడా అదే చెప్పాడు. దానితో నాగార్జున ఊరోడా అంటే తప్పు లేదు, అందరూ ఊరు నుంచి వచ్చినవాళ్ళమే అంటూ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అసలు ముసుగు తీసేసారు. మాట మార్చిన విషయంలో నాగ్ గట్టిగా అనకపోయినా పల్లవి ప్రశాంత్ ఏడుస్తున్నట్టుగా యాక్ట్ చేశాడంటూ నెటిజెన్స్ మాట్లాడుతున్నారు.