సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్ 22 కి వెళ్ళిన ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ ని చూసి అదే రోజు వద్దామనుకున్న నాని, నితిన్, వెంకీలు తమ తమ సినిమాలు పోస్ట్ పోన్ చేసుకున్నారు. భారీ బడ్జెట్ చిత్రంతో మన చిన్న చిత్రలు పోటీ పడడం ఎందుకు అని వారు తగ్గారు. ఇక బాలీవుడ్ లోను షారుఖ్ డుంకి చిత్రాన్ని డిసెంబర్ 22 నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగానే జరిగింది. మరోపక్క ఈఏడాది రెండు బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న షారుఖ్ సలార్ కి భయపడడు అక్కడుంది రాజ్ కుమార్ హిరానీ అని కూడా అన్నారు.
ఏది ఏమైనా ప్రభాస్ vs షారుఖ్ ఫైట్ ఉండకపోవచ్చని అనుకున్నారు. కానీ తాజాగా డుంకి ని మేకర్స్ సలార్ కన్నా ఒకరోజు ముందుగానే విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అసలు సలార్ పై పోటీకి తగ్గేదేలే, సలార్ కి భయపడేదే లే అన్నట్టుగా వారు డేట్ లాక్ చేసి డిసెంబర్ 21 న డుంకి విడుదల అని అనౌన్స్ చేసారు. ఇలా అయితే మొదటి రోజు భారీగా స్క్రీన్స్ దక్కుతాయి. ఓపెనింగ్స్ భారీగా వస్తాయి. అసలే పఠాన్, జవాన్ రెండు బిగ్గెస్ట్ హిట్స్ ఉన్నాయి కూడా.
ఒకవేళ డుంకి పాజిటివ్ టాక్ వస్తే.. దానిని ఎవరూ ఆపలేరు. ఇక సో సో టాక్ వచ్చినా అత్యధిక స్క్రీన్స్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. మొదటి రోజు ఓపెనింగ్స్ రూపంలోనే బోలెడన్ని కలెక్షన్స్ వచ్చేస్తాయి. ఇక తర్వాత రోజు సలార్ దిగినా ఇబ్బంది రాదు. అటు సలార్ కి బెస్ట్ ఓపెనింగ్స్ రావడమైతే పక్కా, ప్రభాస్-కేజిఫ్ డైరెక్టర్ కలిస్తే అంచనాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు. ఒకరోజు పోటీకి దిగి తన్నుకోవడం ఎందుకు.. అందుకే డుంకి సలార్ కన్నా ఒక్కరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చెందుకు రెడీ అయ్యింది.
కాకపోతే ప్రభాస్ సలార్ ని లెక్క చెయ్యకుండా దిగుతుంది. అది ప్రభాస్ ఫ్యాన్స్ కి కి మింగుడు పడడం లేదు. డైనోసార్ లాంటి క్రేజ్ సలార్ కి ఉంది. అటు కూడా రాజ్ కుమార్ హిరానీ మూవీస్ కి ఫ్యాన్ బేస్ మాములుగా ఉండదు. అసలే షారుఖ్ మాంచి క్రేజ్ లో ఉన్న హీరో. అందుకే ప్రభాస్ తో పోటీకి సై అన్నారు అని కొందరు మాట్లాడుకుంటున్నారు.