Advertisementt

కళ్ళు జిగేల్ మనిపించే స్పెషల్ పార్టీ

Sat 21st Oct 2023 10:18 PM
mythri movie makers  కళ్ళు జిగేల్ మనిపించే స్పెషల్ పార్టీ
Mythri Movie Makers Throws Stunning Party కళ్ళు జిగేల్ మనిపించే స్పెషల్ పార్టీ
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలవడంపై ఆయన ఇంట్లోనే కాదు పుష్ప 2 సెట్స్ లోను ఇప్పుడు మైత్రి మూవీస్ వారు పార్టీల మీద పార్టీలే అన్నట్టుగా ఉంది. నేషనల్ అవార్డు గెలిచిన తర్వాత అల్లు అరవింద్ తన ఇంట్లోనే టాలీవుడ్ ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. ఇక నిన్నగాక మొన్న అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకుని ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాగానే అల్లు అర్జున్ మామగారు స్పెషల్ గా ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి చాలామంది దర్శకులు, ఇంకా టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఇక నిన్న పుష్ప 2 సెట్స్ లో కేక్ కట్ చేయించి సెలెబ్రేట్ చేసారు.

ఇక ఈ రోజు శనివారం పుష్ప 2 మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్ వారు నేషనల్ అవార్డు విన్నర్స్ కోసం గ్రాండ్ పార్టీ అరేంజ్ చేసారు. ఈ పార్టీకి అల్లు అర్జున్ స్పెషల్ గా హాజరవుతుండగా.. ఇండస్ట్రీ నుంచి దర్శకనిర్మాతలు, ఇంకా మైత్రి వారితో పని చేసిన కొంతమంది హీరోలు కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. పుష్ప కి , ఉప్పెన మూవీస్ కి నేషనల్ అవార్డ్స్ వచ్చిన సందర్భంగా ఈ పార్టీని అరేంజ్ చేసారు మైత్రి వారు. వారు ఎంత గ్రాండ్ గా ఈ పార్టీ నిర్వహించారో అనేది పై పిక్స్ చూస్తే తెలుస్తుంది.

మరి ఈ పార్టీకి ఎవరెవరు హాజరయ్యారో అనేది రేపు సోషల్ మీడియాలో ఓపెన్ చూస్తే అర్ధమవుతుంది. ఈ పార్టీకి వెళ్లినవారంతా నేషనల్ అవార్డు విన్నర్స్ తో ఫోటో దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. సో ఆలా తెలిసిపోతుందన్నమాట. 

Mythri Movie Makers Throws Stunning Party :

Mythri Movie Makers Celebrates the National Award Winners of TFI  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ