భగవంత్ కేసరిలో బాలయ్యకి పెంపుడు కూతురుగా నటించిన శ్రీలీల క్రేజు ప్రస్తుతం టాలీవుడ్ లో విపరీతంగా ఉంది. భగవంత్ కేసరిలో నార్మల్ లుక్స్ తో, ఆర్మీకి తయారయ్యే అమ్మాయిగా సింపుల్ గా కనిపించిన శ్రీలీల ఆ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం చాలా ట్రెడిషనల్ గా పదహారణాల తెలుగమ్మాయిగా లంగావోణీలు, చుడీదార్స్ లో దర్శనమిచ్చింది. క్యూట్ గా స్వీట్ గా ముద్దు ముద్దు మాటలతో మెస్మరైజ్ చేసే శ్రీలీల పెళ్లి సందడి చిత్రానికి చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంది.
ఇప్పుడు క్రేజ్ ఉన్న హీరోయిన్ గా టాలీవుడ్ ని ఏలుతున్న శ్రీలీల భగవంత్ కేసరి లో కూతురు పాత్రకి భారీగానే పుచ్చుకుందట. బాలయ్య పెరఫార్మెన్స్ తర్వాత అంతగా శ్రీలీల నటననే పొగుడుతున్నారు. ఎవరో కొంతమంది మాత్రం శ్రీలీల డాన్స్ లేదు, గ్లామర్ లేదు అంటూ విమర్శించినా విజ్జి కేరెక్టర్ కి ఏం కావాలో, ఏం చెయ్యాలో అది మాత్రమే చేసింది. ఆ పాత్ర డిజైన్ ఆలా ఉంది. కొంతమంది శ్రీలీల నుంచి వేరే ఏదో ఆశించి సినిమాకెళ్లి పనిగట్టుకుని విమర్శించి నవ్వులపాలయ్యారు.
ఇక విజ్జి పాత్రలో ఒదిగిపోయి ప్రాణం పెట్టి నటించిన శ్రీలీల ఈ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ లో అదరగొట్టేసింది. ఇక ఈ చిత్రానికి శ్రీలీల అక్షరాలా 1.80 లక్షల పారితోషకం అందుకుంది. కాజల్ కన్నా శ్రీలీల కే ఎక్కువట. కాజల్ కి ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో ఆమె కోటిన్నరకి పారితోషకం తగ్గించుకోగా శ్రీలీల మాత్రం 1.80 లక్షల పారితోషకం అందుకుందట. మరి ఈ లెక్కన రాబోయే సినిమాకి ఈ పాప పారితోషకం ఎంతుంటుందో చూద్దాం.