మరొక్క రోజు ఆగితే ప్రభాస్ ఫాన్స్ కి దసరా ఫెస్టివల్ కన్నా ఎక్కువగా సెలెబ్రేట్ చేసుకునేది ప్రభాస్ బర్త్ డే ని. ఈసారి దసరా పండగ-ప్రభాస్ బర్త్ డే ఒకే రోజు రావడం వారికి మరింత కిక్ ఇస్తుంది. మాములుగా ఫెస్టివల్స్ కి కొత్త సినిమాల లుక్స్ రావడం అనేది కామన్. మరి దానికి హీరోగారి బర్త్ డే కూడా తోడైతే పండగ కాస్తా జాతరగా మారుతుంది. ప్రభాస్ బర్త్ డే సోమవారమే. దసరా కూడా అదే రోజు. అందుకే ప్రభాస్ ఫాన్స్ చాలా ఆత్రంగా ఉన్నారు. రెండు సెలెబ్రేషన్స్ కోసం వారు వెయిటింగ్.
ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రభాస్ కోసం ఆయన సినిమాల మేకర్స్ ఏం సర్ ర్పైజ్ లు ఇవ్వబోతున్నారో తెలియదు కానీ.. సలార్ నుంచి ప్రశాంత్ నీల్ ట్రైలర్ వదులుతారని చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి నిజంగా సలార్ నుంచి అంత భారీ సర్ ప్రైజ్ వస్తే ఫాన్స్ ఆగుతారా.. ఇక నాగ్ అశ్విన్ ప్రభాస్ బర్త్ డే కి కల్కి నుంచి ఏం ప్లాన్ చేసారో అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మరోపక్క మారుతి ప్రభాస్ ఫస్ట్ లుక్ వదులుతామని ఆయన బర్త్ డే రోజే మాటిచ్చారు.
ఇక ఈ మూడు సర్ ప్రైజ్ ల కోసం ప్రభాస్ ఫాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. సలార్ నుంచి ట్రైలర్ ఇస్తే గనక ఇప్పటికే అనౌన్సమెంట్ వచ్చేది. కానీ ఇంతవరకు ఆ జాడ లేదు. మరో రెండు రోజుల్లో ప్రభాస్ బర్త్ డే కోసం రెడీ కాబోతున్న ఆ సర్ ప్రైజ్ ల కోసం అభిమానులు మాత్రం భారీగా ఆశలు పెట్టుకున్నారు.