Advertisementt

రేణు దేశాయ్ కి రీ ఎంట్రీ షాక్

Sat 21st Oct 2023 12:34 PM
tiger nageswara rao  రేణు దేశాయ్ కి రీ ఎంట్రీ షాక్
Renu Desai was shocked by Tiger Nageswara Rao result రేణు దేశాయ్ కి రీ ఎంట్రీ షాక్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ మాజీ భార్య అన్న ట్యాగ్ నుంచి రేణు దేశాయ్ ఎప్పుడో బయటికి వచ్చేసింది. తన ఇద్దరి పిల్లలతో జీవిస్తూనే అప్పుడప్పుడు సినిమాల్లో యాక్టీవ్ గా కనిపిస్తుంది. గతంలో హీరోయిన్ గా బద్రి, జానీ సినిమాల్లో నటించిన రేణు దేశాయ్ పవన్ తో పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉంది. ఇప్పుడు రవితేజ టైగర్ నాగేశ్వరావు మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో రేణు దేశాయ్ హేమలత లవణంగా కనిపించింది.

అయితే టైగర్ నాగేశ్వరావు సినిమా విడుదలకు ముందు రేణు దేశాయ్ పాత్రపై చాలా హైప్ క్రియేట్ చేసారు మేకర్స్. ఆ పాత్ర కథను మలుపు తిప్పేదిగా ఉండబోతుంది అన్నట్టుగా అంచనాలు క్రియేట్ చేసారు. అయితే సినిమా విడుదలయ్యాక కానీ అసలు విషయం తెలియలేదు.. రేణు దేశాయ్ పాత్ర గురించి. హేమలత లవణంగా సామజిక వేత్తగా రేణు దేశాయ్ నాలుగైదు సీన్స్ కే పరిమితమయ్యింది తప్ప ఆమె పాత్ర కథపై ఎలాంటి ప్రభావం చూపలేదు.

టైగర్ నాగేశ్వరావు లాంటి భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా చిత్రంతో సక్సెస్ అందుకుని గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇద్దామనుకున్న రేణు దేశాయ్ కి ఈ సినిమా రిజల్ట్ బిగ్ షాక్ నిచ్చింది. టైగర్ నాగేశ్వరావు కి ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి సో సో టాక్ రావడంతో అది రేణు దేశాయ్ కి షాక్ అనే చెప్పాలి. ఈ చిత్రం హిట్ అయితే రేణు దేశాయ్ వెనుక టాలీవుడ్ ఇండస్ట్రీ తిరిగేది. కానీ ఇప్పుడు కష్టమే.

Renu Desai was shocked by Tiger Nageswara Rao result:

Tiger Nageswara Rao public talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ