మెగా ఫాన్స్ అడుగడుగునా డిస్పాయింట్ అవుతూనే ఉన్నారు. రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ విషయంలో మెగా ఫాన్స్ అలుగుతూనే ఉన్నారు. నిర్మాత దిల్ రాజు కూడా గేమ్ ఛేంజర్ అప్ డేట్ పై చేతులెత్తేశారు. వచ్చే సంక్రాంతికి గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ తమ ముందుకు వస్తాడు అనుకున్న మెగా ఫాన్స్ కి అది 2025 కి మారే ఛాన్స్ వుంది అని తెలియడంతో మరింతగా డిస్పాయింట్ అవుతున్నారు.
అయితే ఈ దసరాకి గేమ్ ఛేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది అంటూ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా.. కొంతమంది కావాలని ఈ అప్ డేట్ ని వైరల్ చేసారు. అది నిజం అంటూ చిత్ర బృందం స్పందించింది. దీనితో మెగా ఫాన్స్ దసరా పండగలో పాటుగా గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్ పండగ చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ రాక ఆలస్యమంటూ వార్తలు రావడంతో మెగా ఫాన్స్ బాగా డిస్పాయింట్ అవుతున్నారు.
కొన్ని కాణాల వలన దసరాకి గేమ్ ఛేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ వదలడం లేదు అని తెలుస్తుంది. దానితో మెగా ఫాన్స్ దర్శకుడు శంకర్-నిర్మాత దిల్ రాజు పై ఫైర్ అవుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వదలిన షూటింగ్ నుంచి ఫస్ట్ సింగిల్ వదలడానికి ఇంత చెయ్యాలా అంటూ వారు మండిపడుతున్నారు.