టీడీపీ తో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించాక.. పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు టీడీపీని కలుపుకుపోతేనే జగన్ ని గద్దె దించుతామని చెబుతున్నారు తప్ప.. అటువైపు నుంచి అంటే టీడీపీ నుంచి మాత్రం దీనికి అనుకూలంగా ఎలాంటి సంకేతాలు రావడమే లేదు. అధినేత జైల్లో ఉండగా.. ఆయన కొడుకు లోకేష్ ఢిల్లీకి రాజమండ్రికి తిరుగుతున్నారు. మధ్యలో బాలకృష్ణ తమ సినిమా రిలీజ్ వ్యవహారాల్లో కనిపిస్తున్నారు తప్ప.. పవన్ కళ్యాణ్ పొత్తు పై ఆలోచించే తీరిక వారికి లేదు.
కానీ పవన్ కళ్యాణ్ పదే పదే టీడీపీ తో కలిసి ఈ ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేస్తామని చెబుతున్నారు. కార్యకర్తలు, ప్రజలు కూడా టీడీపీ తోనే కలిసి పోటీ చెయ్యమని కోరుకుంటున్నారంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. మధ్యలో సినిమా షూటింగ్స్, ఖాళీ సమయాల్లో రాజకీయాలంటూ పవన్ కళ్యాణ్ చేసే హడావిడిలోనూ టీడీపీ గురించే ఆయన మాట్లాడుతున్నారు. పవన్ ఎంతగా తాపత్రయపడుతున్నా టీడీపీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడా పవన్ కళ్యాణ్ తో కలిసి పోటీ చేసే విషయం మాట్లాడం లేదు. ఎలక్షన్స్ లో జనసేన కి ఎన్ని సీట్లు ఇవ్వాలో అనే లెక్క తేలడం లేదు. చంద్రబాబు బయటికొస్తే కానీ అది తేలదు. పెద్దాయన ఎప్పుడు రావాలి ఎప్పుడు జనసేనతో జట్టు కట్టాలి అనేది జనసైనికులు కూడా ఎదురు చూస్తున్నారు.
మరి పవన్ కళ్యాణ్ మాట్లాడాడమేనా.. టీడీపీ కూడా జనసేన విషయంలో కాస్త పాజిటీవ్ సంకేతాలు ఇస్తే ఏపీ రాజకీయాలు మరింతగా వేడెక్కుతాయి. లేదంటే ఇలా చప్పగానే కనిపిస్తాయి. అటు వైసీపీ కి కూడా వీళ్ళు.. మాటలనిపించుకునేందుకు ఛాన్స్ ఇస్తున్నట్టే కనిపిస్తుంది.