రవితేజ కొత్త దర్శకుడు వంశీని నమ్మి ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీగా టైగర్ నాగేశ్వరావు చేసాడు. ఈ చిత్రం కోసం రవితేజ కొన్నేళ్ళుగా పడని కష్టాన్ని పడ్డాడు. చాలా ఇంట్రెస్టింగ్ గా చేసిన టైగర్ నాగేశ్వరావు ప్రమోషన్స్ ని కూడా రవితేజ ఈ మధ్య కాలంలో ఏ చిత్రానికి చెయ్యనంతగా చేసాడు. ముంబై వెళ్లి అక్కడే కొద్దిరోజులు ఉండి సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాడు. ఇక ఈ దసరా సెలవలకి క్యాష్ చేసుకునేందుకు రవితేజ టైగర్ నాగేశ్వరావు ని ఈరోజు అంటే అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.
పబ్లిక్ నుంచి విమర్శకుల నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్ర డిజిటల్ హక్కులని అమెజాన్ ప్రైమ్ వారు దక్కించుకున్నారు. టైగర్ నాగేశ్వరావు ఓటిటీ పార్ట్నర్ గా అమెజాన్ ప్రైమ్ ఉండబోతుంది. భారీ డీల్ తో అన్ని భాషలకు కలిపి ఈ చిత్ర హక్కులని అమెజాన్ ప్రైమ్ వారు తీసుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని నవంబర్ 18 తర్వాతే ఓటిటిలో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.