Advertisementt

బిగ్ బాస్ 7: హౌస్ లో ఏడ్చేసిన శివాజీ

Fri 20th Oct 2023 03:30 PM
sivaji  బిగ్ బాస్ 7: హౌస్ లో ఏడ్చేసిన శివాజీ
Bigg Boss 7: Shivaji cried in the house బిగ్ బాస్ 7: హౌస్ లో ఏడ్చేసిన శివాజీ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 లో సెటిల్డ్ గా కనిపిస్తున్న యాక్టర్ శివాజీ ప్రస్తుతం చేతికి దెబ్బతగిలించుకుని ఇబ్బంది పడుతున్నాడు. ఆరోగ్య కారణాల దృష్యా శివాజీ బిగ్ బాస్ లో అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతున్నాడు. అయితే తాజాగా శివాజీ బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతాను, హ్యుమానిటి లేదు ఇక్కడ అంటూ అనేసరికి బిగ్ బాస్ శివాజీని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచాడు. అమరదీప్ శివాజీ ని అన్నా మీరు సరిగ్గా ఆడలేకపోతున్నారు. మీకన్నా బాగా కష్టపడి ఆడినవారికి కెప్టెన్సీ ఛాన్స్ ఇద్దామన్నాడు, దానితో శివాజీ నేను ఆడలేకపోతున్నానా.. మీతో పాటు ఆడాను కదా అంటూ అమర్ పై ఫైర్ అయ్యాడు.

కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చిన శివాజీని బిగ్ బాస్.. మీరు ఇబ్బంది పడుతున్నారా శివాజీ అని అడగ్గానే.. అవును బిగ్ బాస్ నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, ఎంతగా ఇబ్బంది పడుతున్నాను అంటే ఇదంతా లాగుతుంది, ఎవరూ లేనప్పుడు ఏడుస్టున్నాను, అందరూ ఉన్నప్పుడు నవ్వుతూనే లోపల ఏడుస్తున్నాను, ఇదంతా బరువుగా అనిపిస్తుంది. మనశ్శాంతి లేదు, నా ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నాను ఇంకా ఆడలేదు అంటున్నారు. ఇక్కడ తప్పు ఒప్పు ఏమి లేదు అంటూ శివాజీ ఎమోషనల్ అయిన ప్రోమో వైరల్ అయ్యింది. 

Bigg Boss 7: Shivaji cried in the house:

Sivaji Cried For the First Time In Bigg Boss House

Tags:   SIVAJI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ