సోషల్ మీడియా ఓపెన్ చేస్తే #BlockBusterLeo, #DisasterLeo హాష్ టాగ్స్ దర్శనమిస్తున్నాయి. నిన్న లియో విడుదల తర్వాత అజిత్ ఫాన్స్ తో పాటుగా ఇంకొంతమంది విజయ్ యాంటీ ఫాన్స్ లియో డిసాస్టర్ హాష్ టాగ్ ట్రేండింగ్ లోకి తెచ్చారు. సాయంత్రానికి విజయ్ ఫాన్స్ బ్లాక్ బస్టర్ లియో హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తూ హల్చల్ మొదలు పెట్టారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో మూవీపై ప్యాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలే ఉన్నాయి.
కానీ లియో ఆ అంచనాలు అందుకోవడంలో పలు భాషల్లో విఫలమైంది. తెలుగులో లియో కి డిసాస్టర్ టాక్ వచ్చేసింది. లోకేష్ కనగరాజ్ పై నమ్మకంతో థియేటర్స్ లో అడుగుపెట్టిన ప్రేక్షకులు.. సినిమా అయ్యాక ఇది అసలు లోకేష్ సినిమానేనా.. లోకేష్ ఏమిటి ఇలా చేసాడు అని మ్లాడుకుంటూ బయటకొస్తున్నారు. తమిళనాట అయితే విజయ్ క్రేజ్ తో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగులోనూ బాలయ్య భగవంత్ కేసరిని పక్కనబెట్టి లియోకి పరుగులు పెట్టారు ప్రేక్షకులు.
థియేటర్స్ కి ఎంత హుషారుగా వెళ్లారో సినిమా చూసి బయటికొచ్చేసరికి నీరసలోచ్చేసాయి. ఇక లియో సినిమా ని మేము ప్రదర్శించము అంటూ తమిళనాట కొన్ని థియేటర్స్ ముందు బోర్డులు దర్శనమిచ్చాయి. అక్కడ థియేటర్ ఓనర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్యన గొడవ. మరోపక్క విజయ్ అభిమానులు అతి చేస్తూ రోడ్ల మీద కొబ్బరి కాయలు పగలగొడుతూ ప్రజలని భయబ్రాంతులకు గురి చేసారు. ఇవన్నీ ఒక ఎత్తు సోషల్ మీడియాలో #BlockBusterLeo, #DisasterLeo హాష్ టాగ్స్ ఒక ఎత్తు. నిన్నటి నుంచి ఈరోజు వరకు ఈ రెండు హాష్ టాగ్స్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.