మాస్ మహారాజ రవితేజ ఫస్ట్ ప్యాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరావు నేడు భారీ అంచనాల నడుమ భారీగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దసరా ఫెస్టివల్ కి బాలకృష్ణ భగవంత్ కేసరి, తమిళనాట విజయ్ లియో తో వస్తున్న రవితేజ బెదరకుండా టైగర్ నాగేశ్వరావు కంటెంట్ పై విపరీతమైన నమ్మకంతో బాక్సాఫీసు బరిలో నిలిపాడు. దసరా హాలిడేస్ కలిసొస్తాయంటూ వచ్చేసిన రవితేజ టైగర్ నాగేశ్వరావు షోస్ ఇప్పటికే ఓవర్సీస్ లో పూర్తయ్యాయి. మరి ఓవర్సీస్ లో టైగర్ టాక్ ఏమిటో చూద్దాం..
టైగర్ నాగేశ్వరరావులో రవితేజ మాస్ ఎంట్రీ అదిరిపోయింది, రవితేజ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది, మూవీ థ్రిల్లింగ్ రైడ్, రవితేజ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు అంటూ కొంతమంది ఓవర్సీస్ ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. యాక్షన్, ఎలివేషన్స్, ఎమోషన్స్‌తో డైరెక్టర్ వంశీ సినిమాను బాగా బ్యాలెన్స్ చేశాడు. సినిమాలో స్క్రీన్ ప్లే హైలెట్, ఫైట్స్, జీవీ ప్రకాశ్ మ్యూజిక్, ఇంటర్వెల్ సీన్, ఫస్టాఫ్ బాగా హ్యాండిల్ చేశాడు.. అంటూ మరో ఆడియెన్ కామెంట్ చేసాడు.
హీరో క్యారెక్టర్ నెగిటివ్‌గా ఉంది. సాంగ్స్ అంతగా బాగా లేవు. బీజీఎం, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. సెకండాఫ్‌లో కొన్ని లోపాలు ఉన్నాయి. మొదటి 30 నిమిషాలు అద్బుతంగా ఉంటుంది. ఆ తర్వాత సినిమా స్లోగా అనిపిస్తుంది. ఎలివేషన్స్ తక్కువగా కనిపిస్తాయి. స్టోరీ ఆధారంగా సినిమా నడుస్తుంది. 3 గంటలపాటు టైగర్ నాగేశ్వరరావు ప్రపంచంలో కొత్త అనుభూతిని నింపాడు.. అంటూ కొంతమంది ఆడియన్స్ టైగర్ నాగేశ్వరావు పై ట్వీట్లు వేస్తున్నారు.
ఓవరాల్ గా మాస్ రాజాకి హిట్టు పడిపోయింది, టైగర్ నేగీశ్వరావు తో రవితేజ ఫస్ట్ ప్యాన్ హిట్ హిట్ కొట్టాడు. రవితేజ ఈ చిత్రాన్ని నమ్మి చెయ్యడమే కాదు, చాలా కష్టపడ్డాడు, అలాగే ఈ సినిమాని అంతే ప్రమోట్ చేసాడు. ఏదైనా రవితేజ కష్టానికి ఫలితం దక్కింది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.