జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో చర్చనీయాంశంగా మారారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ వ్యవహార శైలి హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలకు గ్యాప్ ఇస్తే రాజకీయాలు.. రాజకీయాల్లో కాస్త గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తూ పోతున్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయం తెలుసుకున్న పవన్ రోడ్డు మార్గాన ఏపీకి వచ్చి మరీ ఆందోళన చేశారు. ఆ సమయంలో పవన్ చాలా హైలైట్ అయ్యారు. ఆ తరువాత మళ్లీ సినిమా షూటింగ్‌ల కోసం గాయబ్ అయ్యారు. కనీసం ఒక ప్రెస్‌నోట్ కూడా విడుదల చేసింది లేదు.
ఇక చంద్రబాబును రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన అనంతరం వెళ్లి ఆయనతో ములాఖత్ అయ్యారు. ఆ తరువాత పొత్తు ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద సవాళ్లే చేశారు. ఇంకేముంది? పవన్ అంతన్నారు.. ఇంతన్నారు కాబట్టి ఇక మీదట ఆయనే అంతా తానై అటు టీడీపీని.. ఇటు జనసేనను నడిపిస్తారు. సరైన సమయంలో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అసలు సిసలైన నేత అంటే పవనేనంటూ జనసేన కార్యకర్తలు సైతం ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆ తరువాత మళ్లీ గాయబ్.
మరికొద్ది రోజులకు వచ్చి వారాహి యాత్ర అన్నారు. దానికి కూడా జనం బ్రహ్మరథం పట్టారు. ఈసారి కూడా ఇక పవన్ రంగంలోకి దిగారు వైసీపీ నేతలకు చుక్కలేనంటూ రకరకాల చర్చలు. సీన్ కట్ చేస్తే రెండు రోజుల్లో యాత్రను ముగించేసి మమ అనిపించి మళ్లీ మాయం. ఈరోజు వరకూ కనిపించే లేదు. పాలిటిక్స్‌లో సైతం పవన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి గాయబ్ అవుతున్నారు. ఇలా అయితే కేడర్‌లో మాత్రం నిరుత్సాహం రాదా? పవన్ గతంలో కూడా చేసిన తప్పు ఇదే. దాన్నే మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నారు. ఇలా అయితే పవన్ ఇప్పుడే కాదు.. ఎప్పటికీ విజయం సాధించలేరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.