కోలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ గా కనిపించే హీరో సూర్య-జ్యోతికలు ఇప్పుడు చెన్నైని వదిలి ముంబైలో మకాం పెట్టారు. అయితే సూర్య తన భార్య జ్యోతిక వలనే తండ్రికి ఫ్యామిలీకి దూరమయ్యాడు, తండ్రికి జ్యోతిక నటించడం ఇష్టం లేకపోవడంతో భర్యని ఇష్టపడని తండ్రి దగ్గర ఉండలేక సూర్య చెన్నై నుంచి ముంబై వెళ్లాడని కోలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి. కానీ కార్తీ మాత్రం తన అన్న-వదినలు ముంబై వెళ్ళింది పిల్లల చదువుల కోసం అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. జ్యోతిక లేని ఇల్లు కళ కోల్పోయింది అంటూ మాట్లాడాడు.
అయితే తాజాగా జ్యోతిక తన లవ్ స్టోరీని బయటపెట్టింది. మొదటిసారిగా సూర్యని ప్రేమ వివాహం ఎలా చేసుకుందో అనేది మీడియాకి వివరించింది. సూర్య ఆడవాళ్లపై చూపించే గౌరవం, ముఖ్యంగా తన పట్ల ఉండే గౌరవం చూసే సూర్యని ఇష్టపడినట్లుగా చెప్పింది. పూవెళ్ళం కెట్టుప్పర్ సినిమాలో కలిసి నటించినప్పుడు తమ మధ్యన ప్రేమ మొదలయ్యింది, అలా ఏడు సినిమాల్లో కలిసి నటించాము అంటూ చెప్పుకొచ్చింది.
నేను బిజీగా వున్న సమయంలో అంటే వరస సినిమాలతో, షూటింగ్స్ తో అలిసిపోయేదాన్ని, కావాల్సినంత డబ్బు కూడబెట్టాను. అలాంటి సమయంలోనే సూర్య నాకు ప్రపోజ్ చేసాడు. మా తల్లితండ్రులకి చెప్పి ఒప్పించి ఒక్కటయ్యాము. సినిమాల్లో హీరోయిన్స్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో డైరెక్టర్ చెప్పినట్టుగానే సూర్య చేసేవాడు. కొంచెమైనా చొరవ తీసుకునేవాడు కాదు. అదే నాకు సూర్య పట్ల ఇష్టం పెరిగేలా చేసింది. ఒక తండ్రిగా సూర్య చాలా సీనియర్ గా ఉంటాడు.
అలాగే భర్తగాను అంతే గౌరవిస్తాడు. అది చూసి చాలామంది మహిళలు సూర్య లాంటి భర్త ఉండాలని, సూర్యని చూసి తమ భర్తలు నేర్చుకోవాలని మట్లాడుకునేవారు. సూర్య ఏ విషయంలో అయినా స్పెషల్. తాను నా జీవితంలోకి రావడం నా అదృష్టమంటూ జ్యోతిక చెప్పుకొచ్చింది.