Advertisementt

జనసేనతో బీజేపీ పొత్తుపై ప్రశ్నలెన్నో..

Thu 19th Oct 2023 05:02 PM
bjp  జనసేనతో బీజేపీ పొత్తుపై ప్రశ్నలెన్నో..
Many questions on BJP alliance with Janasena.. జనసేనతో బీజేపీ పొత్తుపై ప్రశ్నలెన్నో..
Advertisement
Ads by CJ

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అయితే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి చేతులు దులిపేసుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సగం మంది సభ్యుల జాబితాను వెలువరించింది. బీజేపీ తొలి జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు ఎన్నికల్లో పొత్తుకు సైతం బీజేపీ యత్నిస్తోంది. తెలంగాణ ఎన్నికల బరిలో తొలిసారిగా జనసేన పోటీ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే లోకల్ లీడర్లతో వరుస సమావేశాలు ఏర్పాటు చేసింది. ఆ పార్టీ నేతలు వచ్చేసి.. గత ఎన్నికల్లో బీజేపీ కోసం సైడ్ అయిపోయామని ఈసారి అయినా ఎన్నికల  బరిలోకి దిగకుంటే తెలంగాణ మన పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని జనసేనానికి చెప్పారు. 

ఈ సారి కూడా పరిస్థితులు చూస్తుంటే జనసేన.. బీజేపీతో పొత్తుతోనే ముందుకు వెళ్లేలా కనిపిస్తోంది. అయితే తెలంగాణ జనసేన నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న పవన్.. 32 నియోజకవర్గాల నుంచి పోటీకి ఇప్పటికే సై అన్నారు. ఈ తరుణంలో జనసేనతో కలిసి వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. నిన్న దీనికి సంబంధించి జనసేనానిని బీజేపీ ముఖ్య నేతలు ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటi రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కలిశారు. ఈ సమావేశం ముఖ్యంగా పొత్తుపై జరిగిందని టాక్. పవన్ తన అభిప్రాయాన్ని అయితే వివరించినట్టుగా తెలుస్తోంది. 32 స్థానాల్లో తమ పార్టీ బలంగా ఉన్నందున అక్కడ పోటీకి సిద్ధమవుతున్నట్టు వివరించారు. 

గతంలో తాము మద్దతు అయితే ఇచ్చామని.. కానీ ఇప్పుడు సీట్ల పంపకాల్లో తేడా వస్తే తమ పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశకు గురవుతుందని వివరించినట్టు సమాచారం. ఇప్పుడు ఏపీలో సైతం బీజేపీ పొత్తును జనసేన కోరుకుంటోంది. అక్కడ పొత్తు గురించి ఏమాత్రం స్పందించకుండా తెలంగాణలో పొత్తుపై మాత్రమే జనసేనానితో చర్చించడం గమనార్హం. మొత్తానికి తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు అంశం ఎన్నో ప్రశ్నలను తలెత్తేలా చేస్తోంది. ఇక్కడ పవన్ సై అంటే ఏపీలో సైతం బీజేపీ పొత్తుకు ముందుకు వస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోనీ ఏపీలో పొత్తు లేదు అనుకున్నా కూడా తెలంగాణలో పొత్తు పెట్టుకున్నా జనసేన అడిగిన నియోజకవర్గాలను బీజేపీ ఆ పార్టీకి కేటాయిస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి తెలంగాణలో బీజేపీతో పొత్తు అనేది రెండు రోజుల్లో అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో పొత్తు అంశం తేలుతుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది.

Many questions on BJP alliance with Janasena..:

There are many questions on the alliance of BJP with Janasena in Telangana..

Tags:   BJP
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ