గత ఏడాది మాయోసైటిస్ బారిన పడిన సమంత అటు షూటింగ్స్ కి ఇటు తనకిష్తమైన ఫుడ్ కి దూరమైంది. అలాగే తనకి ఎంతో ఇష్టమైన వర్కౌట్స్ ని కూడా పక్కనబెట్టి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంది. శరీంలో బలం లేక, అలసటతో సతమతమైన సమంత ఈ ఏడాది మళ్ళీ ఖుషి, సిటాడెల్ షూటింగ్స్ కంప్లీట్ చేసేసింది. షూటింగ్స్ లో యాక్టీవ్ గానే కనిపించిన సమంత మళ్ళీ ఏడాదిపాటు ఆరోగ్యం కోసం నటనని పక్కనబెట్టింది.
ప్రస్తుతం అమెరికాలో హెల్త్ టీట్మెంట్ లో ఉన్న సమంత రీసెంట్ గా దుబాయ్ లోని జ్యువలరి షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసింది. ఆ తర్వాత చేతికి సెలైన్ పెట్టుకుని ఇలాంటి డిప్స్ తనకి ఎనెర్జీని ఇస్తున్నాయని, తాను కోలుకుంటున్నట్లుగా చెప్పింది. ఇక రీసెంట్ గా తనకి ఎంతో ఇష్టమైన బ్రెడ్ తిని ఏడాది ఊర్తయ్యింది. మళ్ళీ ఇప్పుడు తింటున్నాను అని చెప్పుకొచ్చిన సమంత ఇప్పుడు బ్రెడ్, బట్టర్, జామ్ ని కొద్ది కొద్దిగా తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.
తనకి వచ్చిన అరుదైన వ్యాధి వలన కొన్ని ఆహారపదార్ధాలని వైద్యుల సూచనల మేరకు పక్కనబెట్టిన ఆమె మళ్ళీ ఇన్నాళ్లకి కోలుకుంటూ తనకిష్తమైన ఆహారానికి దగ్గరవుతుంది. మరి దీనిని బట్టి సమంత కాస్త కోలుకుంటున్నట్లుగానే కనబడుతుంది. ఆమె త్వరగా ఆ వ్యాధిని నయం చేసుకుని మళ్ళీ షూటింగ్స్ లో బిజీ కావాలని ఆమె అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.