ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ చిత్రంలోని భీమ్ నటనకు గాను హాలీవుడ్ స్టార్స్ నుంచి ప్రశంశలు అందుకున్నారు. ఆ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ఆస్కార్స్ విషయంలోనూ బాగా హైలెట్ అయ్యారు. ప్రస్తుతం దేవర ప్యాన్ ఇండియా మూవీతో పాటుగా బాలీవుడ్ లోకి వార్ 2 తో ఎంటర్ కాబోతున్న ఎన్టీఆర్ కి అరుదైన అవకాశం దక్కింది. అది అకాడమీ అఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త మెంబెర్స్ ని సెలెక్ట్ చేసింది.
అకాడమీ అఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ అనౌన్స్ చేసిన లిస్ట్ లో ఎన్టీఆర్ తో పాటుగా ఐదుగురు హాలీవుడ్ నటుల పేర్లు ఉండడంతో ఎన్టీఆర్ కి ఇది అరుదైన గౌరవంగా తారక్ అభిమానులు ఫీలవుతున్నారు. అంకితభావం ఉన్న ఈ యాక్టర్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించారు. వెండితెరపై వారి హావభావాలతో ఎంతోమంది అభిమానులని సొంతం చేసుకున్నారు. వారి అద్భుతమైన నటనతో పాత్రలకి ప్రాణం పోశారు. అలాంటి గొప్ప నటులని యాక్టర్స్ బ్రాంచ్ లోకి ఆహ్వానిస్తున్నామంటూ అకాడమీ వారు చేసిన ప్రకటనతో తారక్ అభిమానులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.