విజయ్ సినిమాలకి తెలుగులో డిమాండ్ బాగా తగ్గింది. ఆయన సినిమాలు తమినాడుతో పాటుగా తెలుగులో డబ్ అవుతాయి. థియేటర్స్ లో రిలీజ్ అవుతాయి. కానీ ప్రమోషన్స్ ఉండదు. దానితో తెలుగు ప్రేక్షకులు కూడా విజయ్ ని లైట్ తీసుకునే పరిస్థితి వచ్చేసింది. కానీ LCU అంటూ లోకేష్ కనగరాజ్ తెలుగు ఆడియన్స్ లో బలమైన ముద్ర వేసాడు. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో తనకంటూ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. దానితో లోకేష్ సినిమాలకు తమిళం తో పాటుగా తెలుగులోనూ, ఇతర భాషల్లోనూ విపరీతమైన క్రేజ్ మొదలయ్యింది. అదే క్రేజ్ తో నేడు లియో తెలుగులో భారీగా విడుదలయ్యింది.
ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో బాలయ్యని, రవితేజని డామినేట్ చేస్తూ లియో బుకింగ్స్ నడిచాయి. ఇక అక్టోబర్ 19 న గ్రాండ్ గా విడుదలైన లియో కి మిక్స్డ్ టాక్ కనిపిస్తుంది. ఫస్టాఫ్ బాగుందని.. కానీ సెకండాఫ్ కాస్త డౌన్ అయ్యింది అంటూ ఎక్కువ మంది రివ్యూలు పెడుతున్నారు. లియో సినిమా మొదటి 10 మినిట్స్ అస్సలు మిస్ కాకండి. ఆ 10 నిమిషాలు ఎంతో స్పెషల్‌గా సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. దాని కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశామంటూ లోకేష్ పెంచిన హైప్ కనిపించకపోయేసరికి..దానిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
ఇక విజయ్ లియో లోకేష్ LCU లో భాగం అవునో.. కాదో అనే సస్పెన్స్ క్రియేట్ చేసినా రిలీజ్ అయ్యాక అది LCU లో భాగమని తేలిపోయింది. ఇక సినిమాకి మిక్స్డ్ టాక్ రావడం, కొంతమంది LCU లో భాగమని సినిమా చూస్తే అది ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు, లోకేష్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే సోషల్ మీడియాలో లియో ఇన్ LCU : ఆడియన్స్ ఇన్ ICU అంటూ సరదాగా ట్రోల్స్ చేస్తూ కామెడీ మొదలు పెట్టారు.