లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో హీరో విజయ్ సెకండ్ టైమ్ నటించిన లియో మూవీ భారీ అంచనాలు నడుమ అక్టోబర్ 19 న నేడు ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి దిగింది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అర్జున్ సర్జా, త్రిషా కృష్ణన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి భారీ తారాగణంతో భారీగా విడుదలైన లియో ఇప్పటికే ఓవర్సీస్ లో షోస్ కంప్లీట్ చేసుకుంది. రికార్డు స్థాయి ఓపెనింగ్స్ తో దాదాపు 34 దేశాలలో రిలీజ్ అయిన లియోని ఇప్పటికే కొన్నిదేశాల్లో ఇండియన్స్ వీక్షించేసి.. సినిమా ఎలా ఉందో తమ తమ అభిప్రయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.
లియో ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. లోకేష్ కనకరాజ్ టేకింగ్ బాగుంది. ఈ సినిమాలో సౌండ్ మిక్సింగ్, ఫైట్ డిజైన్ అద్బుతంగా ఉంది. అనిరుధ్ బీజఎం సూపర్బ్‌గా ఉంది. లోకేష్ స్క్రీన్ ప్లేతో సినిమాను ఇరగదీశాడు అంటూ ఓవర్సీస్ ఆడియన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో రెట్రో సాంగ్ అదిరిపోయింది. కాఫీ షాప్ ఫైట్ మామూలుగా లేదు. హైనా సీక్వెన్స్, కానీ విజయ్ మ్యానరిజమ్స్ నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ యాక్షన్, కెమెరా, బీజీఎం, స్క్రీన్ ప్లేతో లోకేష్ కనకరాజ్ అదరగొట్టాడు. విజయ్ మైండ్ బ్లోయింగ్ ఫెర్ఫార్మెన్స్ అంటూ విజయ్ ఫాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తున్నారు.
టైటిల్ కార్డు అదిరిపోయింది, లాగ్ లేకుండా కథలోకి నేరుగా తీసుకెళ్లాడు. సినిమాలో నాన్సెన్స్ అనేది కనిపించలేదు అంటూ మరికొంతమంది స్పందిస్తున్నారు. లియోకు రొలెక్స్ మధ్య ఫైట్ వేరే లెవెల్. అరాచకానికి కేరాఫ్ అడ్రస్. క్లైమాక్స్ సీన్ అదిరిపోయింది.. అంటూ ఇంకొంతమంది చెబుతున్నారు. బాంబులు, కత్తులు, చెవులు చిల్లుపడేలా బీజీఎం తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు, హీరోని ఎలివేట్ చేసే క్రమంలో లోకేష్ కానగరాజ్.. త్రిష, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవన్ మీనన్ క్యారెక్టర్లు బాగా డీల్ చేయలేదు.. తెలుగు ప్రేక్షకులకి లియో ఎక్కడం కష్టమే అంటూ తెలుగు వారు ట్వీట్లు వేస్తున్నారు. మరి లియో ఫైనల్ రిపోర్ట్ ఫుల్ రివ్యూలో చూద్దాం.