సీతా రామం బ్లాక్ బస్టర్ తర్వాత టాలీవుడ్ లో నెమ్మదిగా బిజీ అయిన మృణాల్ ఠాకూర్.. ప్రస్తుతం నానితో హాయ్ నాన్న మూవీతో డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆతర్వాత వెంటనే జనవరిలో విజయ్ దేవరకొండ తో కలిసి VD13 మూవీ తో మరోసారి ఆడియన్స్ ని పలకరించేందుకు సిద్దమవుతుంది. అయితే సీతా రామంలో చాలా ట్రెడిషనల్ గా కనిపించిన మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత గ్లామర్ చేస్తుంది. హాయ్ నాన్న లోనూ ఆమెది గ్లామర్ పాత్రే.
ఇక తనకి మూసపాత్రలు చెయ్యడమంటే ఇష్టం లేదు.. ఒకే భాషలో సినిమాలు చేసుకుంటూ ఇమేజ్ అనే చట్రంలో ఇరుక్కోవడం ఇష్టం లేదు, అన్ని రకాల పాత్రల్లోనే కాదు, అన్ని భాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులని మెప్పించాలని ఉంది. ఏ భాషలో అయినా డిఫరెంట్ పాత్రలు చేయాలన్నదే తన కోరిక అంటూ చెప్పుకొచ్చింది మృణాల్.