Advertisementt

రెండో పెళ్లి చేసుకుంటా: పవన్ మాజీ భార్య రేణు

Wed 18th Oct 2023 12:19 PM
renu desai  రెండో పెళ్లి చేసుకుంటా: పవన్ మాజీ భార్య రేణు
Renu Desai Reacts On Second Marriage రెండో పెళ్లి చేసుకుంటా: పవన్ మాజీ భార్య రేణు
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎప్పుడూ వార్తల్లో ఉండే వ్యక్తి.. పవన్ కళ్యాణ్ కి విడాకులిచ్చి విడిపోయాక కొన్నేళ్ళకి ఆమె రెండో పెళ్లి చేసుకోవాలనుకుంది. రేణు దేశాయ్ పవన్ తో విడిపోయాక కూడా సినిమాల్లో యాక్టీవ్ గా కనిపిస్తుంది. బిజీగా లేకపోయినా.. అప్పుడప్పుడు సినిమా ఇండస్ట్రీలో కనిపిస్తున్న తాజాగా రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వరావు మూవీలో నటించింది. అయితే రేణు దేశాయ్ తన సెకండ్ మ్యారేజ్ లైఫ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తాను రెండోసారి నిశ్చితార్థం చేసుకుని పెళ్లి చేసుకోకుండా ఆగిపోయింది తన పిల్లల కోసమే అని చెప్పుకొచ్చింది.

తాను ఒకసారి పెళ్లి లైఫ్ ని కాదనుకున్నా వివాహం బంధం మీదున్న గౌరవముతోనే వేరే వ్యక్తితో పెళ్ళికి సిద్ధపడ్డాను. దానికి తన పిల్లలు, బంధువులు అందరూ ఒప్పుకున్నారు. అయితే నిశ్చితార్ధం చేసుకున్న తర్వాత ఆ ఫోటోని నేనే సోషల్ మీడియాలో షేర్ చేశాను. కానీ పెళ్లి చేసుకునే సమయానికి తన కూతురికి ఏడేళ్ల వయసు మాత్రమే. అప్పటికే తండ్రి లేడు. అప్పుడు తాను కూడా పెళ్లి చేసుకుని అతనికి సమయం కేటాయించాల్సి వస్తే.. తన కూతురు ఒంటరిదైపోతుంది అన్న కారణంగానే ఆ పెళ్లిని రద్దు చేసుకున్నాను.

ఇప్పుడు నా కూతురు వయసు 13 ఏళ్ళు, నాకు వివాహ వ్యవస్థ అంటే నమ్మకం ఉంది. ఎటువంటి సంబంధం లేని ఇద్దరు పెళ్లి చేసుకుని భార్య భర్తలుగా మారడం, ఆ బంధం చాలా బలమైంది. ఇప్పటికి నాకు పెళ్లి చేసుకోవాలనుంది. నేను రెండో పెళ్లి చేసుకోవడం నా పిల్లలకి ఇష్టమే. ఒక వ్యక్తి వలన నువ్ హ్యాపీ గా ఉంటానంటే మళ్ళీ పెళ్లి చేసుకో అని అకీరా చెప్పాడు. ఇక ఆద్య కాలేజ్ కి వెళితే నేను పెళ్లి చేసుకుంటాను. దానికి రెండేళ్ల సమయం ఉంది అంటూ రేణు దేశాయ్ తన రెండో వివాహంపై సంచలనంగా మాట్లాడింది. 

Renu Desai Reacts On Second Marriage :

Pawan ex wife Renu Desai Reacts On Second Marriage 

Tags:   RENU DESAI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ