Advertisementt

ఆ ఇద్దరికీ హోల్సేల్ షాకిచ్చిన విజయ్

Tue 17th Oct 2023 09:26 PM
vijay  ఆ ఇద్దరికీ హోల్సేల్ షాకిచ్చిన విజయ్
Vijay gave a wholesale shock to both of them ఆ ఇద్దరికీ హోల్సేల్ షాకిచ్చిన విజయ్
Advertisement
Ads by CJ

నిన్నమొన్నటివరకు విజయ్ లియో పై తెలుగు స్టేట్స్ లో క్రేజ్ లేదు.. లియో ట్రైలర్ చూసాక ఉన్న అంచనాలు కూడా తగ్గిపోయాయి.. లోకేష్ కనగరాజ్ ఖైదీ, విక్రమ్ లతో వచ్చిన కేజ్ లియోపై కనిపించడం లేదు.. తెలుగు రాష్ట్రల్లో బాలకృష్ణ, రవితేజలదే హవా అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే సీన్ రివర్స్ లో కనిపిస్తుంది. లియో తెలుగు బుకింగ్స్ చూస్తే బాలయ్య-రవితేజ అభిమానుల కడుపు మండిపోతుంది. విజయ్ దూసుకుపోతున్నాడు. 

లియో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో లేదో ఎగబడి టికెట్స్ బ్లాక్ చేస్తున్నారు ఆడియన్స్. ఇదంతా విక్రమ్ మాయే అంటున్నారు సినీప్రేమికులు. లోకేష్ కనగరాజ్ విక్రమ్ మూవీతో అభిమానులని ఓ ట్రాన్స్ లో పెట్టి ఉంచాడు. ఇప్పుడు అదే లియోపై క్రేజ్ పెరగడానికి కారణమయ్యింది అంటున్నారు. భగవంత్ కేసరి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి, రవితేజ టైగర్ నాగేశ్వరావు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ లియో బుకింగ్స్ కన్నా అవి కాస్త నెమ్మదిగా కదులుతున్నాయి. లియో బుకింగ్స్ మాత్రం ఓ రేంజ్ లో కనిపించడం చూస్తే విజయ్ బాలయ్య-రవితేజలకి హోల్సేల్ షాకిచ్చినట్టే కనిపిస్తుంది. 

మరి మల్టిప్లెక్స్ ల్లో ఎక్కువగా విజయ్ లియో మీదే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. భగవంత్ కేసరిపై అలాగే టైగర్ పై కూడా అంచనాలున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో లియో హవా బాగా కనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే బాలయ్య భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయం. అసలే దసరా సీజన్ పైగా ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యే సినిమాగా భగవంత్ కేసరి ఉంది. మరి లియో ధాటిని భగవంత్-టైగర్ లు ఏమేరకు తట్టుకుంటాయో చూడాలి. 

Vijay gave a wholesale shock to both of them:

Bookings for this week biggies open in Hyderabad

Tags:   VIJAY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ