ఎక్కడ విజయ్ లియో విడుదలై భగవంత్ కేసరి ఓపెనింగ్స్ కి గండికొడుతుందో అనే ఆందోళనలో నందమూరి అభిమానులు ఉన్నారు. వారు ఎంతగా ఆందోళన పడ్డారో ఇప్పుడు అంత ఆనందంగా ఉన్నారు. కారణం లియో ఒకరోజు వాయిదా పడి అక్టోబర్ 19 నుంచి 20 కి షిఫ్ట్ అయ్యింది. కారణం లియో టైటిల్ వివాదం. లియో వాయిదా పడడంతో విజయ్ ఫాన్స్ మాత్రం బాగా నిరాశపడుతున్నారు. 19 ఉదయం 7 గంటల షోస్ కోసం టికెట్ బుకింగ్స్ చేసుకుని ఆత్రంగా ఉంటే.. ఇప్పుడు సినిమా వాయిదా పడిందన్న వార్త వాళ్ళని కలవరపెడుతుంది.
లియో టైటిల్ ఆల్రెడీ ఒక నిర్మాత రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు. తన అనుమతి లేకుండా విజయ్ సినిమాకు వాడుకున్నారని కోర్టులో పిటీషన్ వేయడంతో అతనికి అనుగుణంగా కోర్టి లియో సినిమా ని అక్టోబర్ 20 దాకా రిలీజ్ ని వాయిదా వేస్తూ ఆర్డర్ ఇవ్వడంతో కలకలం రేగింది. లియో వాయిదా తో భగవంత్ కేసరికి ఓపెనింగ్స్ అదిరిపోతాయని అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. లేదంటే లియో ఎంతోకొంత భగవంత్ కేసరికి డ్యామేజ్ అవుతుంది అని కంగారు పడ్డారు.
ఇప్పుడు లియో తెలుగు హక్కులు కొన్న నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి ఆ నిర్మాత మాతో టైటిల్ వివాదంపై మాట్లాడితే సరిపోయేది.. ఈ సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. వీలైనంత తొందరగా వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పడంతో విజయ్ ఫాన్స్ కూల్ అయినా.. బాలయ్య ఫాన్స్ లో మరోసారి ఆందోళన మొదలయ్యింది. చూద్దాం ఏం జరగబోతుందో అనేది.