పుష్ప సినిమాలో అద్భుతమైన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్.. ఈరోజు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం.. అంగరంగ వైభవంగా జరిగింది. నిన్న సోమవారం అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డి తో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ మైత్రి మూవీస్ మేకర్స్ తో కలిసి అల్లు అర్జున్ ఈవేడుకకి హాజరయ్యారు.
ఇంకా దేవిశ్రీ ప్రసాద్, ఉప్పెన బుచ్చిబాబు వీరంతా కూడా నేషనల్ అవార్డు అందుకోవడానికి వెళ్లిన వాళ్ళలో ఉన్నారు. ఒక తెలుగు నటుడు జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం ఇదే మొదటిసారి .