Advertisementt

ఫ్రెండ్స్ మధ్యలో నామినేషన్స్ చిచ్చు

Tue 17th Oct 2023 04:08 PM
bigg boss 7  ఫ్రెండ్స్ మధ్యలో నామినేషన్స్ చిచ్చు
BB7: Tasty Teja vs Shobha Shetty ఫ్రెండ్స్ మధ్యలో నామినేషన్స్ చిచ్చు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 హౌస్ లో నామినేషన్స్ తరవాత చాలామంది విడిపోతున్నారు. గతంలోనూ ఫ్రెండ్స్ మధ్యన నామినేషన్స్ జరిగినా ఈ సీజన్ లో స్నేహితులుగా ప్రొజెక్ట్ అయిన శోభా శెట్టి-టేస్టీ తేజ మధ్యన మాత్రం తారాస్థాయిలో విభేదాలని తెచ్చిపెట్టింది  శోభా శెట్టి-టెస్ట్ తేజ చాలా క్లోజ్ గా, ఫ్రెండ్లీ గా కనిపించారు. ఈ ఏడో వారం నామినేషన్స్ లో శోభా శెట్టి నువ్వు బిగ్ బాస్ రూల్స్ పాటించడం లేదు అంటూ తేజాని నామినేట్ చేసింది. దానికి నేను సరదాగా అన్నాను అన్నాడు తేజ. అది మేము సీరియస్ అనుకుంటున్నామంటూ తేజ ని శోభా నామినేట్ చేసింది.

దానితో తేజ బాగా హార్ట్ అయ్యాడు. హౌస్ లో ఉన్న 12 మంది నాకు ఓట్స్ వేసినా నేను ఇంత ఆలోచించేవాడిని కాదు.. నువ్వు చేసినందువలన నేను ఫీలవుతున్నాను అనగానే.. నేను కాదు గత వారం ప్రియాంక నిన్ను నామినేట్ చేసింది అంది. కానీ తేజ ఎవరు చేసినా నేను పట్టించుకోను కానీ నువ్వు చేసావ్ అంటూ బాధగా వెళ్ళిపోయాడు. ఈ వారం నామినేషన్స్ తేజ-శోభా శెట్టి మధ్యలో చిచ్చు రగిల్చింది. ఇక ఈ వారం నామినేషన్స్ ల చాలా రచ్చే జరిగింది.

భోలే ఇప్పటివరకు సైలెంట్ గా ఉండి ప్రియాంక-శోభా శెట్టిలపై తన పైత్యం చూపించాడు. ఇక అమరదీప్ ని నామినేట్ చేసిన అశ్విని.. అతను కుదరదు అన్నాడని అర్జున్ ని నామినేట్ చేసింది. ఇక గౌతమ్ శివాజీని నామినేట్ చెయ్యడం ఇష్టం లేని యావర్ గౌతమ్ ని టార్గెట్ చేసాడు. శివాజీ కూడా గౌతమ్ తో గొడవపడ్డాడు. మొత్తం మీద ఈవారం నామినేషన్స్ హౌస్ లో రచ్చ ని మిగిల్చాయి.

BB7: Tasty Teja vs Shobha Shetty:

Bigg Boss 7: 7th week Nominations list 

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ