సూపర్ స్టార్ రజినీకాంత్-జ్యోతిక-నయనతారల చంద్రముఖి ఇప్పుడు టీవీలో వేసినా ప్రేక్షకులు వీక్షించడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. దానికి సీక్వెల్ గా వచ్చిన చంద్రముఖి 2 ని మాత్రం తెలుగు నుంచి తమిళ్ వరకు అందరూ లైట్ తీసుకున్నారు. తెలుగులో ప్రమోషన్స్ లేకపోవడమే ఓపెనింగ్స్ లేకపోవడానికి మెయిన్ రీజన్. రాఘవ లారెన్స్, కంగనా జంటగా వచ్చిన చంద్రముఖి2 తెలుగులో భయపెట్టకపోగా డిసాస్టర్ గా నిలిచింది.
తమిళనాట కూడా నిర్మాతలకు ఈ చిత్రం భారీ లాస్ నే మిగిల్చింది. రాఘవ లారెన్స్ రీసెంట్ గా చంద్రముఖి2 పోవడానికి గల కారణాలు కూడా వివరించారు. అయితే థియేటర్స్ లో ఈ చిత్రంతో 20 కోట్ల మేర మేకర్స్ నష్టపోయారని టాక్ ఉంది. థియేటర్స్ లో నిరాశపరిచిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. అక్టోబర్ 27వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది. చంద్రముఖి 2 విడుదలైన కొన్ని రోజుల్లోనే ఆన్ లైన్ లో దర్శనం ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
ఇక థియేటర్లలో చంద్రముఖి 2 చిత్రాన్ని మిస్ అయిన వారు అక్టోబర్ 27వ తేదీ నుంచి ఇంట్లోనే కూర్చొని చూసేయవచ్చు. అక్టోబర్ 27 ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది అని చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.