Advertisementt

బాబోయ్ ఆ రైతు బిడ్డని పంపించేయండ్రా ..

Tue 17th Oct 2023 08:31 AM
bigg boss 7  బాబోయ్ ఆ రైతు బిడ్డని పంపించేయండ్రా ..
BB7: 7th week nominations బాబోయ్ ఆ రైతు బిడ్డని పంపించేయండ్రా ..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 లో రైతు బిడ్డ టాగ్ తో పల్లవి ప్రశాంత్ చాలా వేషాలు వేస్తున్నాడంటూ నెటిజెన్స్ విరుచుకుపడుతున్నారు. పల్లవి ప్రశాంత్ గురించి వివరించి నామినేషన్ వేశారంటే బయట ఆయన పీఆర్ టీమ్ ద్వారా వారిపై ట్రోలింగ్ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకునే హౌస్ లోకి అడుగుపెట్టాడని అమరదీప్ తల్లి ఆరోపిస్తుంది. మొదటి వారాల్లోనే పల్లవి ప్రశాంత్ ని అమరదీప్ విమర్శించిన పాపానికి అతని ఫ్యామిలీపై రైతు బిడ్డ ఫాన్స్ పగబట్టారు. అతను టాస్క్ లు ఏమో కానీ.. నామినేషన్స్ అప్పుడు చేసే యాక్షన్ చూస్తే ఎవ్వరికైనా చిర్రెత్తుకొస్తుంది అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

ఇక నిన్న ఏడో వారం నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ పై సందీప్ మాస్టర్ నువ్వు కెప్టెన్సీని సక్రమంగా నిర్వహించలేకపోయావ్ అందుకే నామినేట్ చేశా అన్నాడు.. అక్కడి నుంచి పల్లవి ప్రశాంత్ చేసిన ఓవరేక్షన్ కి ప్రతి ఒక్క ఇంటి సభ్యుడికి కోపమొచ్చింది. నువ్వు నన్ను ఊరోడివి అన్నావ్ అంటూ సందీప్ ని కెలికాడు పల్లవి ప్రశాంత్. దానితో సందీప్ కి చిర్రెత్తుకొచ్చి నేను అనలేదు.. నువ్వు అన్నావ్ అని అంటున్నావ్ నేల మీద, తినే అన్నం మీద ఒట్టేయ్ అంటూ తన డాన్స్ మీద తాను కొట్టేసాడు. దానితో పల్లవి ప్రశాంత్ మరింతగా రెచ్చిపోయాడు.

నేను అనలేదు అని మాటమార్చగానే శివాజీ అరే నువ్వు ఫ్లోలో ఊరోడు అని సందీప్ అన్నట్లుగా చెప్పావ్ అన్నాడు. ఇక టేస్టీ తేజ కూడా నామినేట్ చెయ్యగానే పల్లవి ప్రశాంత్ అతిగా రెచ్చిపోయాడు. తేజ కూడా ఆపలేదు. పల్లవి ప్రశాంత్ - తేజ మధ్యలో కూడా ఫైట్ జరిగింది. అయితే ఇదంతా చూసిన నెటిజెన్స్ పల్లవి ప్రశాంత్ ని త్వరగా ఎలిమినేట్ చేసి పంపించేయండ్రా మేము అతని యాక్షన్ చూడలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

BB7: 7th week nominations:

Bigg Boss 7 Telugu 7th Week Nominations List

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ