మెగా ఫ్యామిలీ-అల్లు ఫ్యామిలీ మధ్యన విభేదాలు.. అందుకే అల్లు అర్జున్ రామ్ చరణ్ బర్త్ డే ని లైట్ తీసుకున్నాడు, పార్టీకి రాకపోగా.. సోషల్ మీడియాలో కూడా చరణ్ ని విష్ చెయ్యలేదు, అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ నుంచి విడిపోయి అల్లు అభిమానులంటూ వేరు కుంపటి పెట్టాడు, మెగాస్టార్ నీడ నుంచి అల్లు ఫ్యామిలీ ఎప్పుడో బయటికెళ్ళిపోయింది అంటూ ఎప్పటికప్పడు ప్రచారం జరగడం మెగాస్టార్-అల్లు అరవింద్ లు వీటిపై క్లారిటీ ఇవ్వడం చూస్తున్నాము. కలిసి ఉండడం అంటే ఏమిటి.. మేము ఫెస్టివల్స్, పార్టీలు కలిపే చేసుకుంటామని చెప్పినా అనుమానాలు పోవు.
తాజాగా వరుణ్ తేజ్ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో మొన్న మెగాస్టార్ ఇంట్లో పార్టీ జరిగితే అల్లు అరవింద్ దగ్గర నుంచి అల్లు అర్జున్, శిరీష్ అందరూ పాల్గొన్నారు. ఇక నిన్న ఆదివారం సాయంత్రం అల్లు అర్జున్ స్పెషల్ గా వరుణ్ తేజ్ కి లావణ్య లకి ప్రీ వెడ్డింగ్ పార్టీ హోస్ట్ చెయ్యగా.. ఉపాసన దగ్గర నుంచి నాగబాబు ఫ్యామిలీ, మెగాఫ్యామిలీ మొత్తం ఆ పార్టీలో సందడి చేసింది. అటు ఫ్రెండ్ ఇటు మెగా-అల్లు ఫ్యామిలీ పాల్గొన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరి అల్లు అర్జున్ పార్టీలో రామ్ చరణ్ కనిపించలేదు. అంటే చరణ్ కి అల్లు అర్జున్ అంటే కోపమనా దీనర్ధం. చరణ్ భార్య ఉపాసన వచ్చింది. ఇలా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు పార్టీలో, ఫంక్షన్స్ లో మిస్ అవుతారు. అలాగని ఏవేవో ఊహించుకుని కథలు అల్లుకుని మాట్లాడితే ఏమవుతుంది. మరి ఈరోజు బయటికొచ్చిన మెగా-అల్లు ఫ్యామిలీల బాండింగ్ చూసి మబ్బులు విడిపోతే ఓకె.. లేదంటే..!