కోలీవుడ్ హీరో విజయ్-లోకేష్ కనగరాజ్ ల లియో పై తెలుగులో అంచనాలు లేవంటూనే ఆ సినిమా కోసం ఓ వర్గం ఆడియన్స్ వెయిట్ చెయ్యడం చూస్తుంటే ఈ ఎఫెక్ట్ బాలయ్య భగవంత్ కేసరి ఓపెనింగ్స్ మీద ఏమైనా పడుతుందేమో అనిపించేలా ఉంది. లియో ప్రమోషన్స్ విషయంలో విజయ్ ఎప్పుడూ తెలుగుని పట్టించుకోనట్టే.. ఈసారి పట్టించుకోలేదు. కనీసం లోకేష్ కనగరాజ్ అయినా ఓ ప్రెస్ మీట్ పెడతాడు అనుకుంటే అదీ లేదు. సితార వారు లియో తెలుగు రైట్స్ కొన్నారు. కానీ ప్రమోషన్స్ పట్టించుకోవడం లేదు. అందుకే లియో ని ఎవరు చూస్తారులే.. ట్రైలర్ కూడా అంతగా లేదు అనుకున్నారు.
కానీ రేపు గురువారం అక్టోబర్ 19 భగవంత్ కేసరిపై పోటీకి దిగుతున్న డబ్బింగ్ మూవీ లియో పై అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే రామ్ చరణ్ గెస్ట్ రోల్ అంటూ మెగా ఫాన్స్ ని బుట్టలో వేశారు. అది రూమరైనా మెగా ఫాన్స్ లో ఇంకా ఆ క్యూరియాసిటీ పోలేదు. భగవంత్ కేసరిపై ఎంతగా అంచనాలున్నా.. మాస్ ఆడియన్స్ ఎంతోకొంత లియోకి ఓటేసే ఛాన్స్ లేకపోలేదు. ఆ విధంగా బాలయ్య భగవంత్ కేసరి ఓపెనింగ్స్ పై లియో ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మొదటిరోజు ఓపెనింగ్స్ విషయం ఎలా ఉన్నా భగవంత్ కేసరికి పబ్లిక్ నుంచి, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ అయితే సొంతం చేసుకోవాలి. లేదంటే రెండో రోజు టైగర్ నాగేశ్వరావు రూపంలో పెను గండం పొంచి ఉంది. అసలే రవితేజ ఇప్పటికే బాలకృష్ణపై పోటీ పడిన ప్రతిసారి గెలిచి కూర్చున్నాడు. ఇప్పుడు భగవంత్ కేసరిపై రవితేజ గెలుస్తాడో.. లేదో అనేది ఈ నెల 20 శుక్రవారం తేలిపోతుంది.